నరసరావుపేట: పల్నాడు జిల్లాలోని కొండమోడు-పేరేచర్ల మధ్య నిర్మిస్తున్న జాతీయ రహదారి 167 AG పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను జ...
నరసరావుపేట: పల్నాడు జిల్లాలోని కొండమోడు-పేరేచర్ల మధ్య నిర్మిస్తున్న జాతీయ రహదారి 167 AG పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జాతీయ రహదారులు 167 AG, 167A నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు.
ముందుగా రద్దీ ఎక్కువగా ఉండే సత్తెనపల్లి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. డిసెంబరు నాటికి రూ.55 కోట్ల పనుల లక్ష్యానికి మించి పనులు చేయాలన్నారు. రహదారి నిర్మాణ పనుల్లో స్థానికులకు ఉపాధి దక్కేలా చూడాలన్నారు.
నకరికల్లు-ఓడరేవు జాతీయ రహదారి 167A నిర్మాణ కోసం భూసేకరణకు రైతులతో చర్చించి ధరలు నిర్ధారించాలన్నారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఆర్వో మురళి, జాతీయ రహదారుల ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ సంజీవ రాయుడు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS