మన తెలుగుజాతి సంపద అయిన ఒంగోలు జాతి ఎడ్లను కాపాడుకోవడానికి ప్రభుత్వం సహకరించాలి : ప్రత్తిపాటి వ్యవసాయంలో భాగమైన పశుప...
వ్యవసాయంలో భాగమైన పశుపోషణ.. మరీ ముఖ్యంగా పందెపు ఎడ్ల పోషణ అనేది రైతులకు భారంగా మారిందని, ప్రభుత్వాలు పశుపోషకుల కష్టాన్ని, వారి సేవలను గుర్తించి చేయూత అందించాలని మాజీమంత్రి, శానసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కోరారు.
ప్రత్తిపాడులో జరుగుతున్న జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన, బండలాగుడు పోటీలకు ముఖ్యఅతిథిగా ప్రత్తిపాటి హాజరయ్యారు. నందమూరి తారకరామారావు మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలను ప్రారంభించిన అనంతరం రైతులు.. ఎడ్ల యజమానులు... పోటీలకు తరలివచ్చిన ఎడ్ల అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రత్తిపాటి.. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఎడ్ల బలప్రదర్శనకు ప్రభుత్వ చేయూత ఎంతో అవసరం..
పంటలసాగుతో పాటు.. పశుపోషణ అనేది రైతులకు సంతోషాన్నిచ్చే ఇష్టమైన పని అని, దానివల్ల వారు ఆర్థికంగా బాగున్నంత కాలం పందెపు ఎడ్లతో పాటు, ఆవులు..గేదెల్ని పెంచి పోషించారని, కానీ కాలక్రమేణా మారిన పరిస్థితుల వల్ల ఇప్పుడు ఆ ప్రక్రియ అన్నదాతలకు భారంగా మారిందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒంగోలు జాతి.. ఇతర జాతుల ఎడ్లు పెంచే యజమానులు, రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలన్న ప్రత్తిపాటి.. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. గతంలో రాష్ట్రంలో నిలిచిపోయిన ఎడ్ల బలప్రదర్శన పోటీలను చంద్రబాబు ప్రారంభించారన్న ప్రత్తిపాటి..ఎడ్ల యజమానులకు ఉపయోగపడేలా ప్రభుత్వం తరపునుంచి కొంత ఆర్థికసాయం అందేలా చేయడం వల్ల మన రాష్ట్ర సంపద అయిన ఒంగోలు ఎడ్లను కాపాడుకున్నట్టవుతుందని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మహా అయితే 100 చోట్ల బలప్రదర్శన పోటీలు జరుగుతాయని, ప్రతిచోట ఎడ్ల యజమానులకు ప్రభుత్వం తగిన విధంగా అండగా నిలిస్తే, మనతెలుగు జాతి పశుసంపద అయిన ఒంగోలుజాతి పేరుప్రఖ్యాతులు భావితరాలకు తెలుస్తాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికే రైతులకు అనేక పథకాలు అందిస్తోందని, వారి సంతోషాన్ని పెంచే ఎడ్ల బలప్రదర్శన పోటీలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల , రాష్ట్రస్థాయిలో పోటీల నిర్వహణ పెరుగుతుందన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ కమిటీ వారు రెండో ఏడాది వారంపాటు జాతీయ స్థాయి ఎడ్లబలప్రదర్శన పోటీల నిర్వహణ చేపట్టడం నిజంగా అభినందించాల్సిన విషయమన్నారు.ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు సహాకారంతో కమిటీ వారు .. ఎడ్ల బలప్రదర్శన పోటీలను భారీస్థాయిలో నిర్వహించడం శుభపరిణామమన్నారు.
గతంలో ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిలిచిపోతే.. చంద్రబాబు చొరవతోనే తిరిగి ప్రారంభమయ్యాయి.
2014కి ముందు రాష్ట్రంలో ఎడ్ల బలప్రదర్శన, ఇతర పశుప్రదర్శన పోటీలన్నీ నిలిచిపోయాయని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక, ఆనాటి ప్రభుత్వంలో తాను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు కోర్టుద్వారా అన్ని అనుమతులు పొందాక పోటీలకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగి, తిరిగి ప్రారంభించడం జరిగిందని ప్రత్తిపాటి తెలియచేశారు. 2014-19 మధ్య రాష్ట్రవ్యాప్తంగా విరివిగా ఎడ్లపందేలు, పోటీలు బాగా జరిగాయన్న ప్రత్తిపాటి.. ఆనాడు ప్రభుత్వం కూడా ఎడ్ల యజమానులతో మాట్లాడి, వారి సూచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుందన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ అధికమయ్యాక రైతులు ఎడ్లపోషణపై అనాసక్తితో ఉన్నారని, ముఖ్యంగా ఒంగోలు జాతి ఎడ్లను పెంచడం భారంగా మారిందని ప్రత్తిపాటి చెప్పారు. రైతు కుటుంబాల నుంచి ఉన్నతస్థానాలకు ఎదిగిన వారు.. తమకున్న ఆసక్తి మేరకు కొంతవరకు రాష్ట్రంలో ఎడ్ల బలప్రదర్శన పోటీలు జరుగుతున్నాయని ప్రత్తిపాటి చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్ తదితరులున్నారు.
COMMENTS