పల్నాడు జిల్లా లోని స్కూల్స్ మరియు కళాశాల లో మరియు గ్రామాలలో హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత...
పల్నాడు జిల్లా లోని స్కూల్స్ మరియు కళాశాల లో మరియు గ్రామాలలో హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ రూపొందించిన కి వ్యక్తిగతంగా హెచ్ఐవి అంచనా వేసుకొనే క్యూర్ కోడ్ స్టిక్కర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరిగింది.ఈ కార్యక్రమంలో లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి.రవి ముఖ్య అతిథిగా పాల్గొనారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్. బి.రవి మాట్లాడుతూ జిల్లా లో రెండు నెలల పాటు (ఆగస్టు 12 తేదీన నుంచి అక్టోబర్ 12 వ తేదీ వరకు) ఇంటెన్సిఫైడ్ ఐ ఈ సి క్యాంపెయిన్ (హెచ్ఐవి/ఎయిడ్స్ మరియు డ్రగ్ డి అడిక్షన్) కార్యక్రమం జరుగుతుందని,ఈ కార్యక్రమంలో భాగంగా హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన కొరకు రూపొందించిన హెచ్ఐవి రిస్క్ ఇన్ మినిట్స్ క్యూర్ కోడ్ స్టిక్కర్ ఆవిష్కరణ చేస్తున్నామని, ఈ క్యూర్ కోడ్ స్టిక్కర్ స్కాన్ చేయగానే హెచ్ఐవి/ఎయిడ్స్ కు సంబంధించిన 14 ప్రశ్నలు వస్తాయని, ఆ ప్రశ్నల ద్వారా ప్రతి ఒక్కరు హెచ్ఐవి పరీక్ష ఎంతవరకు అవసరమో తెలుసుకోవచ్చని తద్వారా వ్యక్తిగత హెచ్ఐవి యొక్క రిస్క్ ని అంచనా తెలుసుకోనీ పరీక్ష చేయించుకోవాలని చెప్పడం జరిగింది. ఈ క్యూర్ కోడ్ స్టిక్కర్ జిల్లాలోని స్కూల్స్ మరియు జూనియర్,డిగ్రీ కళాశాలలో వద్ద అంటించడం జరుగుతుందని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా లె ప్ర సి ఎయిడ్స్ మరియు టిబి అధికారి డాక్టర్ మురళి కృష్ణ , జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సిబ్బంది పి పి టి సి టి కౌన్సిలర్ జ్యోతి, అమరావతి ఐ సి టి సి కౌన్సిలర్ సురేష్ బాబు మరియు టార్గెటెడ్ ఎన్జీవోస్ ప్రాజెక్ట్ మేనేజర్లు మరియు లింక్ వర్కర్ స్కీమ్ జోనల్ సూపర్ వైజర్ విశ్వేశ్వర రావు పాల్గొన్నారు.
COMMENTS