16 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పని చేయాలి. నరసరావు పేట: పశువుల పెంపకం, ఆక్వా రంగాల్లో అభివృద్ధికి జిల్లాలో ఉన్న అవకాశాలు వినియోగి...
16 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పని చేయాలి.
నరసరావు పేట: పశువుల పెంపకం, ఆక్వా రంగాల్లో అభివృద్ధికి జిల్లాలో ఉన్న అవకాశాలు వినియోగించుకుని 16 శాతం వృద్ధి సాధించేలా పశు సంవర్థక, మత్స్య శాఖలు కృషి చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు.
స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలునందు పశు సంవర్థక శాఖ, మత్స్య శాఖలపై సమీక్ష నిర్వహించారు.
నాణ్యమైన పశువులను పెంచడం ద్వారా పాలు, మాంసం ఉత్పత్తి పెంచే అవకాశాలు దృష్టి సారించాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద 2000 పశువుల షెల్టర్ల నిర్మాణానికి అనుమతులకు దస్త్రం సమర్పించాలన్నారు. జిల్లాలో 50,000 కృత్రిమ గర్భధారణ లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు.
1,17,000 ఎకరాల్లో ఆక్వా పెంపకం చేపట్టాలన్నారు.మత్స్యకార యోజన వంటి పథకాల గురించి అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి రామారావు, జిల్లా మత్స్య శాఖ అధికారి వెంకటరావు, మైక్రో ఇరిగేషన్ పీడీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS