ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఒకరోజు ముందుగానే ఉపాధ్యాయ దినోత్సవం ప్రారంభమ...
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఒకరోజు ముందుగానే ఉపాధ్యాయ దినోత్సవం ప్రారంభమైంది. నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు 2 వేల మందికి పవన్ కల్యాణ్ కానుకలు పంపించారు. మహిళలకు చీరలు, పురుషులకు ప్యాంటు-షర్టు అందజేశారు. వాటిని ప్రత్యేక టీమ్ పిఠాపురం, కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల విద్యాశాఖ కార్యాలయాల్లో ఉదయాన్నే పంపిణీ చేసింది. డిప్యూటీ సీఎం కానుకలు పంపడంపై ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

COMMENTS