చిలకలూరిపేట: పట్టణ ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా పురపాలక సంఘం కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఆర్వో (రివర్స్ ఆస్మాసిస్) ప్లాంట్ యజమాను...
చిలకలూరిపేట: పట్టణ ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా పురపాలక సంఘం కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఆర్వో (రివర్స్ ఆస్మాసిస్) ప్లాంట్ యజమానులందరూ తమ ప్లాంట్ల నుంచి నీటి శాంపిళ్లను సేకరించి, రెండు రోజుల లోపు గుంటూరులోని రీజినల్ ల్యాబ్‌లో సమగ్ర పరీక్షలు చేయించాలని కమిషనర్ స్పష్టం చేశారు.రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ముందస్తు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా, గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని ఒక ఆర్వో ప్లాంట్‌లో క్లెబ్సియెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు ఇటీవల గుర్తించారు. కలుషితమైన ఈ నీటిని తాగడం వల్లే ప్రజలు డయేరియా బారిన పడినట్లుగా అధికారులు నిర్ధారించారని పేట పురపాలక సంఘం ప్రజల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని భావించింది. దీనిలో భాగంగా, పురపాలక సంఘం పరిధిలోని ఆర్వో ప్లాంట్ యజమానులందరూ తమ ప్లాంట్ల నీటిని సేకరించి, గుంటూరు రీజినల్ ల్యాబ్‌లో ఫిజికల్, కెమికల్ & బయోలాజికల్ టెస్ట్‌లు చేయించాలి. ఈ పరీక్షల నివేదికలను రెండు రోజుల్లోగా పురపాలక సంఘ కార్యాలయంలో సమర్పించవలసి ఈ ఆదేశాలను పాటించని ఆర్వో ప్లాంట్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి యొక్క ఆర్వో ప్లాంట్‌ను మూసివేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. నీటి నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని, ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించడమే లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు తెలిపారు.
COMMENTS