పల్నాడు:యూరియా గురించి రైతుల్లో ఆందోళనలు తొలగిస్తూ, వాస్తవ పరిస్థితులను వివరించేందుకు గ్రామ స్థాయిలో అవగాహన బృందాలను ఏర్పాటు చేస...
పల్నాడు:యూరియా గురించి రైతుల్లో ఆందోళనలు తొలగిస్తూ, వాస్తవ పరిస్థితులను వివరించేందుకు గ్రామ స్థాయిలో అవగాహన బృందాలను ఏర్పాటు చేస్తున్నామని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు. వీఆర్వో,మహిళా పోలీసు, వ్యవసాయ/ఉద్యాన సహాయకులు బృందంలో సభ్యులుగా వ్యవహరిస్తారన్నారు.సోమవారం మధ్యాహ్నం యూరియా అంశంపై జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.అవగాహన బృందాలు ప్రతి రైతు వద్దకూ వెళ్లి జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్న విషయం వివరించాలన్నారు. యూరియా పొందడంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు,సాగు చేసిన భూమికి అవసరమైన యూరియా రైతులకు లభించిందా అనే అంశాలపై అధికారులకు నివేదిస్తారన్నారు. వారం రోజుల పాటూ అవగాహన బృందాలు గ్రామాల్లో పర్యటించాలన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదన్న విషయం స్పష్టం చేస్తూనే,అవసరానికి మించి యూరియా కొనుగోళ్లు చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేయాలన్నారు.రానున్న మూడు రోజులు మండల స్పెషల్ ఆఫీసర్లు మండలాల్లోనే తిష్టవేసి యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు.
COMMENTS