యువ నాయకులు ఆధ్వర్యంలో జన సైనికుల సంబరాలు చిలకలూరిపేట: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినర...
యువ నాయకులు ఆధ్వర్యంలో జన సైనికుల సంబరాలు
చిలకలూరిపేట: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. చిలకలూరిపేటలో కూడా యువ నాయకులు ఆధ్వర్యంలో జన సైనికులు పెద్ద ఎత్తున ఈ వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా చిలకలూరిపేట జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ తన కార్యాలయం వద్ద భారీ కేక్‌ను ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కేక్‌ను కట్ చేసి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జన సైనికులకు చరణ్ తేజ స్వయంగా కేక్ తినిపించారు.ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో జన సైనికులు పాల్గొని, తమ అభిమానాన్ని చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
COMMENTS