చిలకలూరిపేట నియోజకవర్గంలోని గణపవరం గ్రామంలో ఇటీవల జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు జగ్గారపు సంజయ్ ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆయన...
చిలకలూరిపేట నియోజకవర్గంలోని గణపవరం గ్రామంలో ఇటీవల జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు జగ్గారపు సంజయ్ ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆయన కుటుంబానికి అండగా నిలుస్తూ జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా 5 లక్షల రూపాయల బీమా చెక్కును పంపించారు.ఆ చెక్కును ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, పి ఓ సి తోట రాజా రమేష్ మరియు స్థానిక నాయకులు కలిసి సంజయ్ కుటుంబానికి అందజేశారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పంపిన సంతాప లేఖను క్రియా వాలంటీర్ మండలనేని చరణ్ తేజ చదివి వినిపించారు.“జనసేన తమ కార్యకర్తలను ఎప్పటికీ మరిచిపోదు. కొడుకు లేని లోటు ఆ తల్లికి, ఆ కుటుంబానికి రానివ్వం” అని గాదె వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాథ్, జిల్లా సంయుక్త కార్యదర్శి సుభాని, పట్టణ నాయకులు మునీర్, చిలకలూరిపేట ఏఎంసి డైరెక్టర్ ఆమదాల లీలా కిషోర్, నాదెండ్ల మండలం అధ్యక్షులు శరత్ మరియు ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.
COMMENTS