నాదెండ్ల మండలం, గణపవరం గ్రామంలో అయ్యప్ప స్వామి వారి అన్నదాన కార్యక్రమం మరియు ప్రత్యేక పూజలు బుధవారం నాడు వైభవంగా జరిగాయి.ఈ కార్య...
నాదెండ్ల మండలం, గణపవరం గ్రామంలో అయ్యప్ప స్వామి వారి అన్నదాన కార్యక్రమం మరియు ప్రత్యేక పూజలు బుధవారం నాడు వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమాలకు చిలకలూరిపేట రూరల్ ఎస్సై అనిల్ కుమార్,ఆయన సతీమణి అనంతలక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత,అన్నదాన కార్యక్రమంలో ఎస్సై దంపతులు భక్తులకు స్వయంగా వడ్డించి భోజనం చేసారు.ఈ సందర్భంగా ఎస్సై అనిల్ కుమార్ మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, సమాజంలో శాంతి, సౌభాగ్యం నెలకొనాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
COMMENTS