అనారోగ్యకరమైన జీవనశైలి.. చెడు ఆహారం తీసుకోవడం వల్ల భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి.. గుండె ధమనులలో రక్తం...
అనారోగ్యకరమైన జీవనశైలి.. చెడు ఆహారం తీసుకోవడం వల్ల భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి..
గుండె ధమనులలో రక్తం గడ్డకట్టడం, వాపు ప్రారంభమై రక్త ప్రసరణ క్షీణించడం ప్రారంభించినప్పుడు, గుండె కండరాలకు ఆక్సిజన్ అందక రక్త ప్రసరణ ఆగిపోతుంది.. దీనిని గుండెపోటు అంటారు.
వైద్యుల ప్రకారం.. గుండెపోటు రాకముందు ఛాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, వికారం, వాంతులు, వీపు, మెడ, దవడ లేదా చేతుల్లో నొప్పి వంటివి కనిపించవచ్చు.. ఈ లక్షణాలు చాలా రోజుల ముందుగానే ప్రారంభమై క్రమంగా తీవ్రతరం కావచ్చు.. కావున ఈ లక్షణాలపై అవగాహనతో ఉండటం ద్వారా.. ప్రమాదాన్ని నివారించవచ్చంటున్నారు వైద్య నిపుణులు.
నివారణ కోసం..
గుండె ఆరోగ్యానికి కొన్ని ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచేలా సహాయపడతాయి. వీటిలో ఆరోగ్యకరమైన ఆహారం.. వ్యాయామం చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. దీనితో పాటు, జీవనశైలిలో చిన్న మార్పులు చేయడం ద్వారా ధమనుల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు.
నడకతో గుండెకు మేలు...
నడక గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రతిరోజూ 30-40 నిమిషాలు వేగంగా నడవడం, యోగా.. ప్రాణాయామం చేయడం గుండెను బలపరుస్తుంది. దీనితో పాటు, సైక్లింగ్, ఈత, తేలికపాటి పరుగు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. అదేవిధంగా, ధ్యానం.. లోతైన శ్వాస కూడా గుండెకు మంచిది. అంతేకాకుండా.. రాత్రి బాగా నిద్రపోండి.. ఎందుకంటే తక్కువ నిద్ర గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
COMMENTS