100 శాతం సక్సెస్ రేటుతో ప్రజలకు చేరువౌతున్న వైనం చిలకలూరిపేట:మాతృత్వం.. సృష్టిలో ఒక వరం. ప్రతీ మహిళ తాను అమ్మ కావాలని కోర...
100 శాతం సక్సెస్ రేటుతో ప్రజలకు చేరువౌతున్న వైనం
చిలకలూరిపేట:మాతృత్వం.. సృష్టిలో ఒక వరం. ప్రతీ మహిళ తాను అమ్మ కావాలని కోరుకుంటుంది. మగువ జీవన సాఫల్యం మాతృత్వంలోనే ఉందంటారు. సంతానం లేని జంటల వేదన వర్ణించలేనిది. ప్రతి ముగ్గురిలో ఒకరు ఏదో ఒక సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారని, వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సంతాన సాఫల్యం అనేది ఒక ఆశ, కానీ ఆ ఆశను ఆసరాగా చేసుకుని కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఎలాగైనా పిల్లలను పొందాలని అనేక చోట్లకు తిరిగి డబ్బులు ఖర్చుపెట్టుకొని, ఇక లాభం లేదనుకొనే దంపతులకు పట్టణంలోని లీలావతి ఆసుపత్రి ఒక వరమనే చెప్పాలి. 100 శాతం సక్సెస్ రేటును సాధిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సుష్మలావు.
వివాహమై ఐదు సంవత్సరాలుగడిచినా ఓ జంటకు పిల్లలు పుట్టలేదు.
విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, జిల్లా ఇలా అన్నీ చోట్ల తిరిగినా ఫలితం లేకుండా పోయింది. చివరకు నెలరోజుల కిందట చిలకలూరిపేట పట్ణణంలోని లీలావతి ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సుష్మ వారి వయస్సు, మెడికల్ హిస్టరీ, జీవనశైలికి సంబంధించిన అనుకూలీకరించిన సంతానోత్పత్తి పరిష్కారాలను అందించటంతో పాటు కౌన్సిలింగ్ నిర్వహించటంతో ఆ యువతి గర్బం దాల్చింది. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. ఈ జంట సంతానోత్పత్తి సవాళ్లను అధిగమించడానికి, అధునాతన, సైన్స్ ఆధారిత చికిత్సల ద్వారా తల్లిదండ్రులవ్వాలనే వారి కలలను నెరవేర్చుకోవడానికి సుష్మ ఆసుపత్రి తిరుగులేని నిబద్ధతను చాటింది.
COMMENTS