చిలకలూరిపేటలో ఈరోజు పోలీసులు పట్టణంలోని లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా అధికారుల ఆదేశాలు, అర్బన్ సీఐ రమేష్ సూచనల...
చిలకలూరిపేటలో ఈరోజు పోలీసులు పట్టణంలోని లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా అధికారుల ఆదేశాలు, అర్బన్ సీఐ రమేష్ సూచనల మేరకు ఎస్సై చెన్నకేశవులు ఈ తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్సై చెన్నకేశవులు మాట్లాడుతూ, లాడ్జిలలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
COMMENTS