పల్నాడు జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన యూరియా మానిటరింగ్ కమిటీ లు జిల్లాలో విస్తృతంగ చేసిన తనిఖీల్లో భాగంగా నిన్న సాయంత్రం 4.30 గంటలకు నకరికల...
పల్నాడు జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన యూరియా మానిటరింగ్ కమిటీ లు జిల్లాలో విస్తృతంగ చేసిన తనిఖీల్లో భాగంగా నిన్న సాయంత్రం 4.30 గంటలకు నకరికల్లు మండల తహసీల్దార్, మండల వ్యవసాధికారి మరియు అసిస్టెంట్ సబ్ ఇనస్పెక్టర్ అఫ్ పోలీస్ సంయుక్తం గా నకరికల్లు మరియు త్రిపురాపురం గ్రామాల మధ్య జాతీయ రహదారి పై కుంకులగుంట గ్రామం నుంచి మంగాపురం తండా,త్రిపురారం మండలo,నల్గొండ జిల్లా కు ఆటో AP 24TA6247 లో 20 బస్తాల యూరియా ను అక్రమంగా తరలిస్తున్న రామావత్ లచ్చు మరియు ఇస్లావత్ వెంకటరావు (డ్రైవర్) పై క్రిమినల్ కేసు మరియు మండల వ్యవసాధికారి ఎరువుల నియంత్రణ చట్టం 1973 మరియు 1985 క్లాజ్ 3 ప్రకారం మరియు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 సెక్షన్ 3 ప్రకారం ఎరువు ల ను తెలంగాణ రాష్ట్రము కు తరలించుట నేరం కాబట్టి సదరు యూరియా స్టాకును సీజ్ చేసి జిల్లా జాయింట్ కలెక్టర్ కోర్టులో 6A కేసు నమోదు చేసినారు.సదరు వాహనం ను స్థానిక పోలీసు స్టేషన్ మరియు సదరు నిందితుల పై క్రిమినల్ కేసు నమోదు చేయ వలసినది గా నెకరికల్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి పిర్యాదు చేసారు.
COMMENTS