నరసరావు పేట: పల్నాడు జిల్లాలో నిర్మిస్తున్న వరికెపూడిశెల ప్రాజెక్టు, పోలవరం-బనక చర్ల ప్రాజెక్టులకు సహకారం అందిస్తానని జిల్లా కలె...
నరసరావు పేట: పల్నాడు
జిల్లాలో నిర్మిస్తున్న వరికెపూడిశెల ప్రాజెక్టు, పోలవరం-బనక చర్ల ప్రాజెక్టులకు సహకారం అందిస్తానని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులకు భరోసా ఇచ్చారు.
స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో ప్రాజెక్టులపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నుంచి అవసరమయ్యే అనుమతుల కోసం నిరీక్షించకుండా వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు.
వరికెపూడిశెల ప్రాజెక్టుకు సంబంధించి అలైన్ మెంట్ ఫిక్సింగ్ ను వారం రోజుల్లోగా పూర్తి చేసి, ల్యాండ్ ప్లాన్ షెడ్యూళ్లను తయారు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో వరికెపూడిశెల ప్రాజెక్టు ఎస్.ఈ వెంకట రత్నం, పోలవరం బనక చర్ల ప్రాజెక్ట్ ఈఈ శివరాం ప్రసాద్, డిఈ లు శ్రీనివాస్, రాజ్ కుమార్, ఏ.ఈ లు వెంకటేశ్వర్లు, శంకరాచారి తదితరులు పాల్గొన్నారు.
COMMENTS