వినాయకుని ఊరేగింపు ట్రాక్టర్ నడిపి, స్వామిని నిమజ్జనానికి సాగనంపిన ప్రత్తిపాటి. పురుషోత్తమపట్నంలో ఒకేరోజు గంగమ్మ చెంతకు తరలిన 33...
వినాయకుని ఊరేగింపు ట్రాక్టర్ నడిపి, స్వామిని నిమజ్జనానికి సాగనంపిన ప్రత్తిపాటి.
పురుషోత్తమపట్నంలో ఒకేరోజు గంగమ్మ చెంతకు తరలిన 33 గణేశ విగ్రహాలు
గణపయ్య నిమజ్జనం కూడా పవిత్రమైన కార్యమేనని, స్వామివారిని ఇన్నిరోజులు ఎంత భక్తి శ్రద్ధలతో పూజించామో, అంతే శ్రద్ధతో గంగమ్మ ఒడికి చేర్చాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణ శివార్లలోని పురుషోత్తమపట్నంలో నేడు ఒకేసారి నిమజ్జనానికి సిద్ధమైన 33 వినాయక ప్రతిమలను దర్శించుకున్న ప్రత్తిపాటి.. ప్రతి విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకున్నారు. పురుషోత్తమపట్నం గ్రామస్తులు ఏటా ఆనవాయితీ ప్రకారం ఊరిలోని వినాయక విగ్రహాలను ఒకేసారి నిమజ్జనానికి తరలించడం మంచి సంప్రదాయమని ప్రత్తిపాటి కొనియాడారు. గ్రామస్తులు అందరూ గణేశచతుర్థిని కట్టుబాట్లతో జరుపుకోవడం నిజంగా అభినందించాల్సిన విషయమన్నారు.
విఘ్నేశ్వరుని ఊరేగింపులో పాల్గొన్న ప్రత్తిపాటి స్వయంగా ట్రాక్టర్ నడిపి, గ్రామస్తులు.. భక్తుల్లో ఉత్సాహం నింపారు. అనంతరం గ్రామస్తులు, వినాయక మండపాల నిర్వహణ కమిటీల సభ్యులు ఏర్పాటుచేసిన అన్నదానాన్ని ప్రత్తిపాటి ప్రారంభించారు. నిమజ్జనోత్సవ కార్యక్రమంలో ప్రత్తిపాటితో పాటు జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, రూరల్ మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమలా రవి, తెలుగుయువత అధ్యక్షుడు గట్టినేని విజయ్ సాయి, బత్తినేని శ్రీనివాసరావు, తోట సత్యం, తేలప్రోలు రామ్మూర్తి, నాగబాబు, బైరా కోటేశ్వరరావు, కళ్యాణ్, తదితరులు ఉన్నారు.
COMMENTS