గుంటూరు నగరంలో గురువారం రాత్రి దొంగనోట్ల కలకలం రేగింది. సేకరించిన సమాచారం, పోలీసులు తెలిపిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. రత్నగిరికాలనీలోని ఓ ...
గుంటూరు నగరంలో గురువారం రాత్రి దొంగనోట్ల కలకలం రేగింది. సేకరించిన సమాచారం, పోలీసులు తెలిపిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. రత్నగిరికాలనీలోని ఓ అపార్ట్‌మెంట్లో గోపిరెడ్డి, జ్యోతి నివాసం ఉంటున్నారు. ఇద్దరు పట్టాభిపురం ప్రధాన రహదారిలో తోపుడు బండిపై వద్దకు వెళ్లి రూ.100కు శనక్కాయలు కొనుగోలు చేశారు. రూ.500 నోటు తీసి చిరు వ్యాపారికి ఇచ్చారు. ఆయన రూ.400 ఛేంజ్ ఇచ్చాడు. తర్వాత అక్కడే ఉన్న బెంగుళూరు అయ్యంగారి బేకరీకి వెళ్లి కూల్‌డ్రింక్ తీసుకుని మరో రూ.500 నోటు ఇచ్చారు. అక్కడ వ్యాపారి మిగతా నగదు ఇచ్చారు. నోటు పల్చగా ఉండడంతో సదరు వ్యాపారికి అనుమానం వచ్చి కేకలు వేయడంతో వెనక్కి వచ్చి వారిచ్చిన రూ.500 నోటు తీసుకుని అంతకుముందు మార్చగా వచ్చిన రూ.100 ఇచ్చి హడావుడిగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంతలో జనం గుమిగూడి అక్కడి నుంచి గోపిరెడ్డి, జ్యోతిని ముందుకు కదలనివ్వకుండా నిలదీశారు. సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు అక్కడకు చేరుకుని ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. హైదరాబాద్‌లో కన్సల్టెన్సీ ఉందని మాయమాటలు చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులు గోపిరెడ్డిని అదుపులోకి తీసుకునే క్రమంలో వారి ద్విచక్ర వాహనం వద్ద ఉన్న బ్యాగ్‌ను ముఠాలో ఒకరు తీసుకుని పరారయ్యాడు. పోలీసులు గోపిరెడ్డి ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో లోతుగా విచారించాల్సి ఉందని పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు.
.jpg)
COMMENTS