తెలుగుదేశం సైనికుల సంక్షేమం..సంతోషానికి టీడీపీ అధినాయకత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని, ప్రమాదవశాత్తూ మరణించిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడ...
తెలుగుదేశం సైనికుల సంక్షేమం..సంతోషానికి టీడీపీ అధినాయకత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని, ప్రమాదవశాత్తూ మరణించిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడం.. కార్యకర్తల పిల్లల యోగక్షేమాలు, చదువుసంధ్యలు చూడటంలో పార్టీ ఎప్పుడూ ముందుంటుందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. కార్యకర్తల సంక్షేమం కోసం చంద్రబాబు ప్రవేశపెట్టిన చంద్రన్నబీమా నిజంగా లక్షలాది టీడీపీ కుటుంబాలకు గొప్ప ధీమాగా నిలుస్తోందని ప్రత్తిపాటి తెలిపారు.
ఇటీవలి కాలంలో రెండు వేర్వేరు దుర్ఘటనల్లో ప్రమాదవశాత్తూ మరణించిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి స్థానిక క్యాంప్ కార్యాలయంలో ప్రమాద బీమా పరిహార చెక్కులు అందించారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన దాసరి పున్నారావు, యడ్లపాడు మండలం మైదవోలు గ్రామవాసి పల్లపు పోతురాజులు ఇటీవల మరణించిన నేపథ్యంలో, ప్రత్తిపాటి సోమవారం వారి కుటుంబసభ్యులతో మాట్లాడి, ఒక్కో కుటుంబానికి పార్టీ అందించిన రూ.5లక్షల విలువైన చెక్కులు అందించి, వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకున్నారు. పార్టీ పటిష్టత, గౌరవం కోసం పాటుపడిన పున్నారావు, పోతురాజుల ఆత్మకుశాంతి కలగాలని వారి కుటుంబాలకు ఎప్పుడూ అండగా ఉంటామని ప్రత్తిపాటి చెప్పారు.
యువనేత లోకేశ్ సారథ్యంలో పార్టీ మరిన్ని విజయాలు సాధిస్తుంది..
ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ... దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత కార్యకర్తల బలం టీడీపీకి ఉందని, వారే పార్టీ సైన్యమని. ప్రజలకు మంచి చేయడంలో వారు నిస్వార్థంగా తమసేవలు అందిస్తారని తెలిపారు. అటువంటి కార్యకర్తల్ని ఆదుకోవాలన్న ధృఢచిత్తంతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రమాదబీమా సౌకర్యం కల్పించారన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేశ్ బాధ్యతలు చేపట్టాక పార్టీకి యువరక్తం ఎక్కించి నూతనోత్తేజం తీసుకొచ్చారని ప్రత్తిపాటి చెప్పారు. లోకేశ్ సారథ్యంలో పార్టీ ఇటీవలే కోటిసభ్యత్వాలు పూర్తిచేసుకుందని, కోటిమంది సైన్యాన్ని నడిపించడంలో, వారి సాధకబాధకాలు తెలుసుకోవడంలో యువనేత లోకేశ్ చురుగ్గా వ్యవహరిస్తున్నారని ప్రత్తిపాటి చెప్పారు. సొంత సోదరుడిలా అన్నివేళల కార్యకర్తలకు అండగా నిలుస్తున్న లోకేశ్ నాయకత్వంలో పార్టీ మరిన్ని విజయాలు సాధిస్తుందని ప్రత్తిపాటి ఆశాభావం వ్యక్తంచేశారు.
COMMENTS