ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ, విశాఖపట్నంలో ప్రతిపాదిత 50 పడకల ఆసుపత్రులతో పాటు, ప్రజారోగ్య అవసరాలను తీర్చడానికి రాయలసీమ, పల్నాడు, ఒంగ...
ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ, విశాఖపట్నంలో ప్రతిపాదిత 50 పడకల ఆసుపత్రులతో పాటు, ప్రజారోగ్య అవసరాలను తీర్చడానికి రాయలసీమ, పల్నాడు, ఒంగోలు వంటి వెనుకబడిన ప్రాంతాల్లో కూడా మరిన్ని ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరాన్ని లోక్‌సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్,నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు లేవనెత్తారు. రాయలసీమ,నంద్యాల వంటి పలు జిల్లాలు అధిక దీర్ఘకాలిక వ్యాధుల వ్యాప్తి ఉందని,కానీ పరిమిత సౌకర్యాలు ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కావున ఆయుష్ మౌలిక సదుపాయాలు అవసరమని హైలైట్ చేశారు.ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ యాక్సెస్‌లో ప్రాంతీయ అంతరాన్ని తగ్గించడానికి పల్నాడుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఇటీవల విశాఖపట్నంలో మాత్రమే జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు దాదాపు మూడు లక్షల మంది ప్రజలు భారీగా తరలివచ్చారని ఆయన గుర్తుచేశారు.ఇందుకు కేంద్ర ఆయుష్ సహాయ శాఖ మంత్రి ప్రతాప్రావ్ గణపత్రావ్ జాదవ్ బదులిస్తూ.. పునర్వ్యవస్థీకరణ తరవాత ఏపీలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను తిరిగి కేటాయిస్తున్నామని మరియు అదనపు ఆయుష్ ప్రాజెక్టులను ప్రణాళిక చేస్తున్నామని తెలియజేశారు.రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్ వ్యవస్థలు విస్తృతంగా అందుబాటులో ఉండేలా చూసేందుకు,సేవలు అందించని ప్రాంతాలలో కొత్త సౌకర్యాల కోసం ప్రతిపాదనలు భవిష్యత్ విస్తరణ ప్రణాళికలలో పరిగణించబడతాయని హామీ ఇచ్చారు.
COMMENTS