అమెరికా అధ్యక్షుడు డ్రొనాల్ట్ ట్రంప్ సుం కాల దెబ్బకు ఆక్వా రంగం విలవిల్లాడుతోంది. ఆక్వా రైతులను పిడుగుపాటుకు గురిచేస్తోంది. ఎగుమతులు నిల...
అమెరికా అధ్యక్షుడు డ్రొనాల్ట్ ట్రంప్ సుం
కాల దెబ్బకు ఆక్వా రంగం విలవిల్లాడుతోంది. ఆక్వా రైతులను పిడుగుపాటుకు గురిచేస్తోంది. ఎగుమతులు నిలిచిపోవటంతో ధరలు రోజురోజుకు పతనమైపోతున్నాయి. చేతికొచ్చిన పంటను నిల్వ చేయలేని స్థితి. తక్కువ ధరకు అమ్ముకుంటే పడిన కష్టానికి ప్రతిఫలం కూడా రాని తీరు తాజాగా నెలకొంది.
జిల్లాలో మంచినీటి ఆక్వా సాగు 78146.57 ఎకరాల్లో, ఉప్పునీటి సాగు 25,023.26 ఎకరాల్లో ఉంది. మొత్తం 1,03,169.83 ఎకరాల్లో సాగు అవుతోంది. అమెరికా సుంకాల పెంపుతో రొయ్యల ధరలు గత కొన్ని రోజులుగా పతనమవుతూ వస్తున్నాయి. దీనికి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందోనన్న అయోమయం నెలకొంది. పంట చేతికొచ్చే దశలో ఊహించని ఉత్పాతంలా సుంకాల దెబ్బకు రైతులు కుదేలవుతున్నారు. అమెరికాకు రొయ్యలు మన దేశం నుంచి ఎగుమతి అవుతున్నాయి. ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా భారత్‌పై ప్రభావం చూపుతోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అయితే, ఈ పరిస్థితిని వ్యాపారులు తమకు కలిసొచ్చే కాలంగా మార్చుకుని ధరలను తగ్గిస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ధరల వరుస పతనాలతో నష్టాలబారిన పయనిస్తున్నారు. ఒక కంటైనర్‌లో 16 టన్నులు ఎగుమతి చేస్తారు. దీని విలువ రూ.1.25కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ధరల పతనం ఇలా: 20 కౌంటు రొయ్యలు కిలో ధర సుంకాలకు ముందు రూ.640 ఉండగా, సుంకం విధించిన తర్వాత రూ.580కి పతనమైంది. 30 కౌంటు రూ.470కి, 40 కౌంటు రూ.380కి క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. కిలో ధర దాదాపు రూ.50 వరకు తగింది. టన్నుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు నష్టపోతున్నామని రైతులు పేర్కొంటున్నారు.

COMMENTS