తప్పిపోయిన ఓ యువతి గురించి వెతుకుతున్న కుటుంబానికి అనుకోనివిధంగా వింత అనుభవం ఎదురైంది. ఇంటినుంచి వెళ్లిపోయిన ఆ యువతి తన సోదరి వరసైన మరో యు...
తప్పిపోయిన ఓ యువతి గురించి వెతుకుతున్న కుటుంబానికి అనుకోనివిధంగా వింత అనుభవం ఎదురైంది. ఇంటినుంచి వెళ్లిపోయిన ఆ యువతి తన సోదరి వరసైన మరో యువతిని వివాహం చేసుకొని.. ఇకపై తాము భార్యాభర్తలుగా జీవించాలనుకుంటున్నామని చెప్పేసరికి పోలీసులు, కుటుంబసభ్యులు కంగుతిన్నారు. అసలేమయ్యిందంటే.. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ముజఫర్‌నగర్‌కు చెందిన యువతి ఇటీవల వారి ఇంటినుంచి తప్పిపోయింది. ఆమెను ఎవరైనా విక్రయించి ఉంటారనే అనుమానంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఆచూకీ గుర్తించిన పోలీసులు భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఇటీవల పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది.
అయితే వరుసకు చెల్లి అయ్యే మరో అమ్మాయితో పెళ్లి దుస్తుల్లో ఆ యువతి పోలీసుస్టేషన్‌కు తిరిగొచ్చింది. తాము వివాహం చేసుకున్నామని.. ఇకపై భార్యాభర్తలుగా (Husband-Wife) కలిసి జీవించాలని వారు పేర్కొనడంతో పోలీసులు, కుటుంబసభ్యులు కంగుతిన్నారు. తాను వరుడిగా మారి తన చెల్లెల్లిని వివాహం చేసుకున్నట్లు సదరు యువతి పోలీసులకు చెప్పింది. ఏడాదిగా తాము ప్రేమించుకుంటున్నామని కుటుంబసభ్యులు తమ ప్రేమను వ్యతిరేకించడంతో పారిపోయి వివాహం చేసుకున్నామని వారు పోలీసులకు తెలియజేశారు. ఇంటికి తిరిగివెళ్లాలని వారిని ఒప్పించడానికి అధికారులు ప్రయత్నించినప్పటికీ.. ఇరువురూ తమ మనసు మార్చుకోవడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.
.jpg)
COMMENTS