జి.ఐ.ఎస్ సర్వే పై సచివాలయ సిబ్బందితో సమీక్షా సమావేశం. చిలకలూరిపేట స్థానిక పురపాలక సంఘంలో శుక్రవారం నాడు సచివాలయ సిబ్బంది తో జి....
చిలకలూరిపేట స్థానిక పురపాలక సంఘంలో శుక్రవారం నాడు సచివాలయ సిబ్బంది తో జి.ఐ.ఎస్.సర్వే పై రెవిన్యూ ఆఫీసర్ పి.సుబ్బారావు. సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జి.ఐ.ఎస్.సర్వే కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యాలను ఉద్దేశాలను సచివాలయ సిబ్బంది కి వివరించారు. రాష్ట్రంలోని ప్రతి పౌరునికి ప్రభుత్వ సేవలను చేరువ చేయడం,పారదర్శకతను పెంపొందించడం, మరియు పరిపాలనను మెరుగుపరచడం లాంటి ప్రభుత్వ మార్గ దర్శకాలను అనుసరించి ప్రతి ఒక్క సచివాలయం పరిధిలో సరైన పన్ను విధించడానికి డోర్ టూ డోర్ జి.ఐ.ఎస్. సర్వే కార్యక్రమాన్ని త్వర్తిగతిని పూర్తి చేసి ఆన్ లైన్లో నమోదు చేయాలని కోరారు.
జి ఐ ఎస్ సర్వేకు ప్రజలు సహకరించాలి..
పట్టణ వాసులకు మెరుగైన సేవలు అందించేందుకు సరైన పన్ను విధించడానికి శాటిలైట్ మ్యాపింగ్ కి అనుగుణంగా,యుటిలిటీ మ్యాపింగ్ కోసం పట్టణ ప్రజలు ఇంటింటికి జిఐఎస్ సర్వే కోసమని వస్తున్న సచివాలయ సిబ్బందికి పూర్తి వివరాలను అందించి సహకరించాలనీ. పుర ప్రజలకు రెవెన్యూ ఆఫీసర్ పి. సుబ్బారావు విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో అర్.ఐ. గిరిబాబు. సచివాలయ అడ్మిన్ లు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
COMMENTS