పారిశుద్ధ్య పనులు పర్యవేక్షిస్తున్న సిహెచ్ రమణ రావు చిలకలూరిపేట : స్థానిక పురపాలక సంఘ పరిధిలోని 1వ డివిజన్ శానిటరీ ఇనస్పెక్టర్ సిహెచ...
పారిశుద్ధ్య పనులు పర్యవేక్షిస్తున్న సిహెచ్ రమణ రావు
చిలకలూరిపేట : స్థానిక పురపాలక సంఘ పరిధిలోని 1వ డివిజన్ శానిటరీ ఇనస్పెక్టర్ సిహెచ్ రమణ రావు మున్సిపల్ కమిషనర్ పీ శ్రీహరిబాబు ఆదేశాల మేరకు బుధవారం నాడు ఒకటో డివిజన్ పరిధిలోనీ బోసు రోడ్డు, చలివేంద్రం బజార్, మెయిన్ రోడ్డు, చౌత్ర సెంటర్, కోమల విలాస్ సెంటర్ , సూర్య టీ స్టాల్ ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు.
ఆయా ప్రాంతాలలో చెత్త సేకరణ, మురుగు కాల్వలను పరిశీలించి వర్ష కాలం దృష్టిలో ఉంచుకొని కాల్వల్లో నీరు పారుదలకు ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలన్నారు, కాల్వల్లో మురుగు నీరు పారుదలకు చెత్త, ప్లాస్టిక్ కవర్లు, వేస్ట్ మెటీరియల్ లాంటివి ఉన్నట్లయితే సక్రమంగా శుభ్రం చేయాలని సిబ్బందికి ఆదేశించారు. వర్ష కాలం దృష్టిలో ఉంచుకొని పారిశుధ్య పనులు నిర్వహణను మెరుగు పరచాలని మున్సిపల్ కమిషనర్ పీ శ్రీహరిబాబు ఆదేశించారని. పనుల నిర్వహణలో అలసత్వం వహించిన నిర్లక్ష్యం వహించిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని శానిటేషన్ సిబ్బందికి మేస్త్రులకు సూచనలు చేశారు. వార్డుల పరిధిలో పారిశుధ్య నిర్వహణ పై ఫిర్యాదులు లేకుండా సచివాలయ సెక్రటరీలు చర్యలు తీసుకోవాలన్నారు.
COMMENTS