నందికుంట విఘ్నేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రత్తిపాటి వినాయకచవితిని పురస్కరించుకొని పట్టణంలో ఏర్పాటుచేసిన స్వా...
నందికుంట విఘ్నేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రత్తిపాటి
వినాయకచవితిని పురస్కరించుకొని పట్టణంలో ఏర్పాటుచేసిన స్వామివారి రూపాలను దర్శించుకున్న మాజీమంత్రి ప్రత్తిపాటి
తనను భక్తిశ్రద్ధలతో పూజించేవారికి సకల శుభాలు అందించి వారు చేపట్టే పనుల్లో, సత్కార్యాల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా చూసే భక్తవరదుడు విఘ్నేశ్వరుడని, వినాయకుని పూజించకుండా, స్మరించకుండా చేపట్టే ఏ కార్యమూ సఫలం కాదని, కార్యసిద్ధితో కూడిన విజయం లభించదని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టంచేశారు.
వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఆయన నందికుంట విఘ్నేశ్వరుని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి, స్వామివారి విశిష్టత, ఆలయంలోని లోటుపాట్లపై అర్చకులు, దేవస్థాన కమిటీతో చర్చించారు.
భక్తులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉత్సవాలు నిర్వహించండి..
అనంతరం నాదెండ్లలో గ్రామస్థులు, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటుచేసిన అన్నదానాన్ని ప్రారంభించి భక్తులకు ప్రసాదం వడ్డించారు. పట్టణంలో పలుచోట్ల ఏర్పాటుచేసిన వినాయక మండపాలకు వెళ్లిన ప్రత్తిపాటి. వివిధ రూపాల్లో ఉన్న గణనాథుని దర్శించుకున్నారు. మండపాల నిర్వాహకులతో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వినాయకచవితి నవరాత్రి ఉత్సవాలు, వేడుకలు నిర్వహించాలని, ఊరేగింపులు జరిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. ప్రభుత్వ యంత్రాంగం వినాయకచవితి వేడుకలపై ప్రత్యేక శ్రధ్ద పెట్టాలని, ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేసిన వినాయకమూర్తులను దర్శించుకునే ప్రజలకు సమస్యలు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, నల్లమోతు హరిబాబు, మురకొండ మల్లిబాబు, కందుల రమణ, పఠాన్ సమాధ్ ఖాన్, పావులూరి శ్రీనివాసరావు, మద్దుమల రవి, ఈవూరి బ్రహ్మానందం, గట్టినేని రమేష్, తుబాటి శ్రీహరి, గట్టినేని విజయ్ సాయి, జాష్టి కిన్ను, బేరింగ్ మౌలాలి, నాగేశ్వరరావు, మధు, కరణం విజయ, జానీ తదితరులున్నారు.
COMMENTS