భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. బ్యారేజీలోకి ప్రస్తుతం 3,03,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది...
భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. బ్యారేజీలోకి ప్రస్తుతం 3,03,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 69 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి 2,97,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి పులిచింతల వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో మరో రెండు మూడు గంటల్లో ప్రకాశం బ్యారేజీకి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముంది. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదీ పరివాహక పొలాల్లోకి వెళ్లవద్దని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది.
.jpg)
COMMENTS