అనధికారలేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకోండి.. కమిషనర్ పి శ్రీహరి బాబు. చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు మీడియాతో మాట్ల...
అనధికారలేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకోండి..
కమిషనర్ పి శ్రీహరి బాబు.
చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు మీడియాతో మాట్లాడుతూ అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. దీనిని లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) అంటారని దీనికి సంబంధించిన జీవో ఎంఎస్ నెంబర్ 134, తేదీ 26/07/2025న జారీ అయిందని ఆయన వివరించారు.
పథకం యొక్క ముఖ్యాంశాలు....
26/07/2025 లోపల వేసిన లేఅవుట్‌లలో, కనీసం ఒక్క రిజిస్ట్రేషన్ అయినా జరిగి ఉంటే, వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
సాధారణంగా ఓపెన్ స్పేస్ లేకపోతే 14% అపరాధ రుసుము కట్టాల్సి ఉంటుంది. ఈ పథకం కింద 7% అపరాధ రుసుము కడితే సరిపోతుంది.
లాండ్ కన్వర్షన్ చార్జీలు, ఇతర డాక్యుమెంట్లు ఉన్నవారు ఆన్‌లైన్‌లో లేదా ఎల్‌టిపి (LTP) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకానికి మూడు నెలల సమయం ఇచ్చారు. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
45 రోజుల లోపు పూర్తి రుసుము చెల్లిస్తే 10% రాయితీ, 46 నుంచి 90 రోజుల లోపు చెల్లిస్తే 5% రాయితీ ఇస్తారు.
రెగ్యులరైజేషన్ వల్ల ప్రయోజనాలు..
భవన నిర్మాణ అనుమతులు, విద్యుత్, నీటి సరఫరా, డ్రైనేజీ వంటివి ప్రభుత్వం కల్పిస్తుంది.
అనుమతించబడిన లేఅవుట్‌లలో బ్యాంక్ రుణాలు సులభంగా లభిస్తాయి.
భవిష్యత్తులో లావాదేవీల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
ఇండివిజువల్ ప్లాట్లను కూడా రెగ్యులరైజ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రజలు రెగ్యులరైజ్ చేయబడిన లేఅవుట్లలో మాత్రమే ప్లాట్లను కొనుక్కోవాలని, అనధికారిక లేఅవుట్లలో కొని నష్టపోకూడదని విజ్ఞప్తి చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు త్వరగా ఈ పథకం కింద తమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని ఆయన కోరారు. సెప్టెంబర్ తర్వాత ఎలాంటి బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వబడవని హెచ్చరించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
COMMENTS