నాదెండ్ల గణపవరం గ్రామంలోని బొడ్రాయి సెంటర్ నందు జే ఆర్ ఎస్ పేపర్ ప్లేట్స్ యూనిట్ను సోమవారం ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ...
నాదెండ్ల గణపవరం గ్రామంలోని బొడ్రాయి సెంటర్ నందు జే ఆర్ ఎస్ పేపర్ ప్లేట్స్ యూనిట్ను సోమవారం ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిలకలూరిపేట జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ మరియు ఉమ్మడి గుంటూరు జిల్లా జాయింట్ సెక్రటరీ షేక్ సుభాని హాజరయ్యారు.గ్రామ యువ నాయకులు అక్కిశెట్టి మురళి మరియు ఇతర గ్రామ పెద్దలు వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మండలనేని చరణ్ తేజ మాట్లాడుతూ,యువత ఇలాంటి స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థికంగా బలపడటంతో పాటు, మరికొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అన్నారు. జే ఆర్ ఎస్ పేపర్ ప్లేట్స్ యూనిట్ యజమానులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.షేక్ సుభాని మాట్లాడుతూ స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఈ యూనిట్ ప్రారంభించడం అభినందనీయమన్నారు.ఈ యూనిట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు,గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
COMMENTS