డ్వాక్రా గ్రూపుల నుంచి ఆడిట్ పేరుతో 400 నుండి 500 వసూళ్లు చిలకలూరిపేట: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థ...
డ్వాక్రా గ్రూపుల నుంచి ఆడిట్ పేరుతో 400 నుండి 500 వసూళ్లు
చిలకలూరిపేట:
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కొంతమంది చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.పట్టణంలో డ్వాక్రా గ్రూపుల మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో గల మెప్మా విభాగాల్లో మహిళా సంఘాల కార్యకలాపాల నిర్వహణకు రిసోర్స్ పర్సన్‌లే కీలకంగా వ్యవహరిస్తుంటారు. వార్డుకు ఒక ఆర్‌పీ చొప్పున, పట్టణ సమాఖ్యకు ఒక ఆర్‌పీ, టీఎంసీలు, ఏడీఎంసీలు, డీఎంసీలు వివిధ స్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందజేయడం, స్త్రీ నిధి రుణాల పంపిణీ, బ్యాంకు కిస్తీల చెల్లింపు, రుణాల రికవరీ తదితర వ్యవహారాల్లో ఆర్‌పీలు బాధ్యత కీలకంగా ఉంటుంది. సంఘాల సభ్యులు రుణాలు పొందాలన్న, తీర్మానాలు చేసుకోవాలన్నా ఆర్‌పీలు రిపోర్టులు తయారు చేస్తుంటారు. అయితే పనిలోనూ ఇటు అధికారులకు, మరోవైపు డ్వాక్రా సంఘాలకు సంధాన కర్తలుగా వ్యవహరిస్తున్న వీరు పురపాలక సంఘం పరిధిలోని మెప్మా విభాగంలో ఆడిట్ రూ. 400- 500 పుస్తకాలు రాసినందుకు మరో రూ. 500 లు ప్రతి ఒక్క గ్రూప్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని డ్వాక్రా మహిళలు వాపోతున్నారు. మరోవైపు ఈ అవినీతిలో మెప్మా అధికారులకు సైతం వాటా ఉన్నట్లు తెలుస్తుంది. పట్టణంలో సుమారు 2600లకు పైగా డ్వాక్రా గ్రూపులు ఉండగా, ప్రతి గ్రూపు నుంచి ఆడిట్ కోసం రూ. 400 నుంచి రూ. 500 వరకు వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు.
గతంలో 250 రూపాయలు ఆడిట్ ఫీజ్ ఇప్పుడు మాత్రం 500
గతంలో ఆడిట్ కోసం కేవలం రూ. 250 మాత్రమే తీసుకునేవారని, ఇప్పుడు ఒక్కసారిగా రేటు పెంచడంపై గ్రూపు సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆడిట్ కాకుండా, గ్రూపులకు సంబంధించిన పుస్తకాలు రాయడానికి మరో రూ. 500 అదనంగా డిమాండ్ చేస్తున్నారని వారు వాపోతున్నారు.పేద మహిళల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ అక్రమ వసూళ్లపై అధికారులు, ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి, విచారణ జరపాలని డ్వాక్రా గ్రూపుల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పేదరికాన్ని నిర్మూలించే లక్ష్యంతో ఏర్పాటైన మెప్మా విభాగంలోనే ఇలాంటి జరగడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.


COMMENTS