పట్టణంలోని వినాయక మండపాలకు వెళ్లి.. గణపయ్యలను దర్శించుకున్న మాజీమంత్రి. భక్తులు, నిర్వాహకులు ఏర్పాటుచేసిన ప్రసాదవితరణను ప్రారంభి...
పట్టణంలోని వినాయక మండపాలకు వెళ్లి.. గణపయ్యలను దర్శించుకున్న మాజీమంత్రి.
భక్తులు, నిర్వాహకులు ఏర్పాటుచేసిన ప్రసాదవితరణను ప్రారంభించిన ఎమ్మెల్యే.
వినాయకచవితి సందర్భంగా పూజాకార్యక్రమాలు, వేడుకలు నిర్వహించడం ఎంత ముఖ్యమో, స్వామివారి నిమజ్జనం కూడా అంతే ముఖ్యమని, ఆ కార్యక్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. పట్టణంలోని మద్ది మల్లయ్య వీధి, దేవిశెట్టి బజార్, పొట్టి శ్రీరాములు బజార్, బంగారు...స్టీలు కొట్ల బజార్, గోల్డ్ షాపుల బజార్, చలివేంద్రం వీధి, విశ్వబ్రాహ్మణ బజార్, భావనారుషి నగర్, 26వ వార్డులో పూజలందుకుంటున్న గణేశ మూర్తులను ప్రత్తిపాటి శనివారం దర్శించుకున్నారు. నిర్వాహకులు మండపాలను బాగా అలంకరించారని, విద్యుత్ వెలుగులతో దేదీప్యమానంగా విరాజిల్లుతున్న లంబోదరుని ప్రతిరూపాలను చూడటానికి రెండుకళ్లు సరిపోవడం లేదని ఈ సందర్భంగా ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. వినాయక నిమజ్జనం వేళ నిర్వాహకులు, భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలన్న ప్రత్తిపాటి.. వీధుల్లో ఊరేగింపు సమయంలో, ముఖ్యంగా నిమజ్జనం చేసేటప్పుడు కాలువలు, నదుల వద్ద ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. నిమజ్జనాన్నికూడా శాస్త్రోక్తంగా నిర్వహించినప్పుడే విఘ్నేశ్వరుని అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందన్నారు. వినాయకచవితి వేడుకల్లో భాగంగా మండపాల వద్ద నిర్వాహకులు, భక్తులు ఏర్పాటుచేసిన ప్రసాదవితరణ ప్రారంభించిన ప్రత్తిపాటి.. స్వయంగా భక్తులకు వడ్డించారు.
వినాయక మండపాలకు వెళ్లిన ప్రత్తిపాటి వెంట సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు సమద్ ఖాన్, మద్దుమలా రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, మల్లిబాబు, బేరింగ్ మౌలాలి, అవ్వరు రమేష్, ఇనగంటి జగదీష్ , వీర కుమారి, నజీరున్నిసా బేగం, లక్ష్మీ, మస్తాన్ వలి, శిఖకొల్లి గుప్తా, గుర్రం సాంబశివరావు, చేవూరి కృష్ణ, కనమర్లపూడి లక్ష్మీ తిరుమల, కనమర్లపూడి రమేష్, అమరా మణి కుమార్, పసుమర్తి రామూర్తి, పోతుగంటి ప్రసాద్, మాధవరావు, శివ తేజ, రాచమల్లు సూర్యారావు, కొలిశెట్టి రంగనాథ్, అర్వపల్లి వీరాంజనేయులు, అనిల్ గుప్తా, మల్లిఖార్జునరావు, హరీష్, గోపాల్, కృష్ణ, వుటుకూరి చంద్ర, అర్వపల్లి ప్రసాద్ తదితరులున్నారు.
COMMENTS