మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ క్రియేట్ చేస్తారా? అయితే మీకో అదిరే అప్డేట్. మెటా మీకోసం ఓ అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని సహాయంతో ...
మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ క్రియేట్ చేస్తారా? అయితే మీకో అదిరే అప్డేట్. మెటా మీకోసం ఓ అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని సహాయంతో ఇప్పుడు మీ వ్యూస్, ఎంగేజ్మెంట్ టైమ్‌ను పెంచుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి.
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ క్రియేట్ వారికి ఉపయోగకరమైన 'Link a Reel' అనే కొత్త ఫీచర్‌ను మెటా ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా ఇన్‌స్టా క్రియేటర్ తమ రీల్స్‌ను సిరీస్‌గా తయారుచేసుకోవచ్చు. ఇది వీక్షకులకు ఒకేసారి సిరీస్‌ను ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇందుకోసం కంటెంట్ క్రియేటర్ ఫీడ్‌ను మళ్లీ మళ్లీ స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇన్‌స్టాలో చూసిన పార్ట్-1 రీల్స్ నచ్చితే పార్ట్-2 కోసం వీక్షకులు కష్టపడి వెతుక్కోవాల్సిన పనిలేదు. తద్వారా ఇన్‌స్టాలో మీ వ్యూస్, ఎంగేజ్మెంట్ టైమ్‌ను పెంచుకునే అవకాశాన్ని మెటా కల్పించింది. ఈ కొత్త ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.
రీల్స్‌ను సిరీస్‌గా మార్చుకోవడం ఎలా?:
ఇందుకోసం ముందుగా మీ ఫోన్లో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయండి.
అందులో కన్పిస్తున్న '+' బటన్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు 'Post' విభాగానికి వెళ్లి మీరు అప్‌లోడ్ చేయాలనుకుంటున్న రీల్‌ను ఎంచుకోండి లేదా క్రియేట్ చేయండి.
రీల్‌ను సవరించిన తర్వాత డ్రాఫ్ట్ విభాగానికి వెళ్లేందుకు 'Next'పై క్లిక్ చేయండి.
ఇప్పుడు క్యాప్షన్ బాక్స్ కింద 'Link a reel' అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
మీరు లింక్ చేయాలనుకుంటున్న రీల్‌ను ఎంచుకోండి. ( గమనిక: ఒకేసారి ఒక రీల్‌ను మాత్రమే ఎంచుకోవచ్చు)
ఇప్పుడు లింక్ చేసిన రీల్స్‌కు టైటిల్‌ను అందించండి. లింక్ చేసిన రీల్స్ మాత్రమే ఈ టైటిల్‌ను ప్రదర్శిస్తాయి. దీనిని మీరు ఎప్పుడైనా మార్చుకోవచ్చు లేదా తీసివేయొచ్చు. టైటిల్ అందించకపోతే ఇన్‌స్టాగ్రామ్ దీనికి 'Linked reel' అని ఆటోమేటిక్‌గా పేరు పెడుతుంది. (రీల్ టైటిల్ 15 అక్షరాలకు మించి ఉండకూడదు.
ఫైనల్‌గా 'Ok'పై క్లిక్ చేసి ఆపై 'Share' చేయండి.
అంతే ఇలా సింపుల్‌గా మీరు ఒక్కొక్కటిగా రీల్స్‌ను సిరీస్‌గా జోడించవచ్చు. అయితే ఇప్పటికే పోస్ట్ చేసిన రీల్స్‌ను కూడా ఇలా జోడించి సిరీస్‌గా అప్‌లోడ్ చేయడం కుదరదా అంటే అది కూడా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ఇప్పటికే పోస్ట్ చేసిన రీల్స్‌ను సిరీస్‌కు లింక్ చేయడం ఎలా?:
ఇందుకోసం మీ ఫోన్లో ఇన్‌స్టాగ్రామ్‌ను ఓపెన్ చేయండి.
ఇప్పుడు మీ ఫీడ్‌కి వెళ్లండి.
మీరు లింక్ చేయాలనుకుంటున్న రీల్‌ను ఎంచుకోండి.
ఎగువ కుడి వైపున ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి.
కిందికి స్క్రోల్ చేస్తే అక్కడ మీకు 'Link a reel' ఆప్షన్ కన్పిస్తుంది. దాన్ని ఎంచుకోండి.
ఇలా సింపుల్‌గా ఇప్పటికే పోస్ట్ చేసిన రీల్‌ను ఇప్పుడు సిరీస్‌గా లింక్ చేసుకోవచ్చు. అయితే మీరు లింక్ చేసిన రీల్‌ను ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అదెలాగో కూడా చెప్తా రండి.
మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న రీల్‌ను ఓపెన్‌చేసి మూడు చుక్కలపై క్లిక్ చేయండి.
'Edit linked reel' ఆప్షన్‌ను ఎంచుకోండి.
అదే సమయంలో వేరే లింక్డ్ రీల్‌ను ఎంచుకోవటానికి అయితే 'Change reel below'పై క్లిక్ చేయండి.
మీరు లింక్‌ను తీసివేయాలనుకుంటే 'Unlink'పై క్లిక్ చేయండి.
కొత్త రీల్‌ను మళ్లీ లింక్ చేయడానికి పైన పేర్కొన్న దశలను అనుసరించండి.

COMMENTS