చిలకలూరిపేట :ప్రజల జీవితాల్లోని అన్ని విఘ్నాలు తొలగిపోయి విజయాలు దరిచేరాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ వినాయక చవితి పర్వది...
చిలకలూరిపేట :ప్రజల జీవితాల్లోని అన్ని విఘ్నాలు తొలగిపోయి విజయాలు దరిచేరాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు జనసేన పార్టీ నియోజకవర్గ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గణనాయకుడైన వినాయకస్వామి జ్ఞానం, బలం, ధైర్యం ప్రసాదించే దేవుడు. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం నెలవాలని, స్నేహసౌభ్రాతృత్వాలు మరింత బలపడాలని కోరుకుంటున్నాను. సమాజంలో ఐక్యత, అభివృద్ధి, శ్రేయస్సు నెలకొని ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం ప్రసరించాలి” అని ఆశాభావం వ్యక్తం చేశారు.అలాగే వినాయక చవితి పండుగ మనకు ధర్మం, క్రమశిక్షణ, ఐక్యత విలువలను గుర్తు చేస్తుందని, సంప్రదాయాలతో పాటుగా సామాజిక సేవకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన తెలిపారు.
COMMENTS