చిలకలూరిపేట:రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్‌ను చేపట్టింది.చిలకలూరిపేట పురపాలక సంఘంలో 255 మంది లబ్ధిదారులు అనర్...
చిలకలూరిపేట:రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్‌ను చేపట్టింది.చిలకలూరిపేట పురపాలక సంఘంలో 255 మంది లబ్ధిదారులు అనర్హులుగా తేలారు. అయితే, ప్రభుత్వం వారికి మరో అవకాశం కల్పించింది.నిజంగా అంగవైకల్యం ఉన్నవారు అప్పీల్ చేసుకోవచ్చు.చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ పి.శ్రీహరి బాబు మాట్లాడుతూ, అప్పీల్ చేసుకున్న వారి దరఖాస్తులను పీడీడీఆర్డీఏకు పంపిస్తాము.అక్కడ నుండి డీఎంహెచ్ఓ కి పంపిస్తారు.అనంతరం నోటీసు జారీ చేసి, డాక్టర్ల బృందంతో మరోసారి వెరిఫికేషన్ చేయిస్తారు. 40 శాతం కంటే తక్కువ అంగవైకల్యం ఉంటే అనర్హులుగా, 40 శాతం కంటే ఎక్కువ ఉంటే మళ్లీ పెన్షన్ పునరుద్ధరిస్తారు అని తెలియజేశారు.అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ పి.శ్రీహరి బాబు కోరారు.
COMMENTS