ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అడపా అశోక్ కుమార్, కౌన్సిల్ మాజీ సభ్యుడు మస్తాన్వలి ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టు ఘన సన్మానం చిలకలూరిపేట: ఆంధ్రప్...
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అడపా అశోక్ కుమార్, కౌన్సిల్ మాజీ సభ్యుడు మస్తాన్వలి ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టు ఘన సన్మానం
చిలకలూరిపేట:
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని చిలకలూరిపేటలో సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి. సుబ్బారావు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు జరిగాయి.
సేవా కార్యక్రమాలు, సన్మానాలు
కార్యక్రమంలో భాగంగా, స్థానిక ప్రశాంతి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఉదయం అల్పాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే సభ్యులు వారితో కొంత సమయం గడిపి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు వృద్ధాశ్రమం ఆవరణలో మొక్కలు నాటారు.ఈ వేడుకలో సీనియర్ జర్నలిస్ట్ కామ్రేడ్ పిట్టలశ్రీనివాసరావునుఏపీయూడబ్ల్యూజే నాయకులు సన్మానించారు. జర్నలిజం రంగానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు.
భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యులు మస్తాన్ వలి, పల్నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అడపా అశోక్ కుమార్, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దరియా వలి మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమంతో పాటు సమాజానికి తమ వంతు సేవలు అందిస్తామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఏపీయూడబ్ల్యూజే పిలుపు మేరకు మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కొచ్చర్ల చందు, పెనుమల మనోహర్, నాదెండ్ల సుందర్ బాబు, మేడూరి ఆంజనేయులు, ఎస్.కె. సిద్ధిక్, రవి కిరణ్, నరసింహాల శ్రీకాంత్, రవిపాటి రాజా, కొండెపాటి రమేష్, కొనికి సాంబశివరావు, శివ తదితరులు పాల్గొన్నారు




COMMENTS