ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు ఆహ్వానం. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే అవకాశం. పట్ట...
ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి.
పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు ఆహ్వానం.
ఉన్నత విద్య అభ్యసించాలనుకునే అవకాశం.
పట్టణంలోని ఆర్‌వీఎస్‌సీవీఎస్ హైస్కూల్ లో ఓపెన్‌స్కూల్ స్టడీ సెంటర్ సదుపాయం..
చిలకలూరిపేట:చదువుకోవాలని ఆసక్తి ఉండి అవకాశాలు లేక, కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, రోజువారీ స్కూల్/కాలేజీకి వెళ్లలేక.. ఇలా కారణమేదైనా విద్యకు దూరమైన వారికి పట్టణంలోని ఆర్‌వీఎస్ సీవీఎస్ హైస్కూల్లో ఉన్న ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ బాసటగా నిలుస్తోంది. ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఉప్పలపాటి వెంకటేశ్వరరావు ఈ సందర్బంగా ఓపెన్ స్కూల్ గురించి, వివిధ అంశాలపై సందేహాలకు సమాధానం ఇచ్చారు. ఆయన మాటల్లోనేసుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆర్‌వీఎస్ సీవీఎస్ హైస్కూల్‌లో నామమాత్రపు ఫీజుతో సార్వత్రిక విద్యాపీఠం ద్వారా (ఏపీ ఓపెన్ స్కూల్) దూరవిద్యను చదువుకోవచ్చు. రెగ్యులర్ సర్టిఫికెట్‌తో సమానమైన ఈ విద్యను వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ చదువుకోవచ్చు.
చదువుకు దూరమైన వారికి....
ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం అండగా నిలుస్తోంది. రెగ్యులర్‌గా పదో తరగతి, ఇంటర్ ఫెయిలైన వారు, వివిధ కారణాలతో మధ్యలో చదువు ఆపేసిన వారు, తక్కువ విద్యార్హతతో ఏళ్ల తరబడి చిరుద్యోగం చేస్తున్న వారు, వ్యాపారులు, బాలికలు, గృహిణులు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, ఆయాలు, దిగువ స్థాయి ప్రజాప్రతినిధులు ఇలా ఎవరైనా చేరవచ్చు. గతంలో ఈ దూర విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండేది. ప్రస్తుతం సమీపంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల్లో చదువుకోవచ్చు. రెండేళ్ల ఇంటర్ విద్య అయినా, పదో తరగతైనా ఏడాదిలోనే పూర్తి చేసుకోవచ్చు.
*ప్రవేశాలకు వేళాయె*..
2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించింది. దరఖాస్తులు ప్రక్రియ మొదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆర్‌వీఎస్ సీవీఎస్ హైస్కూల్లో ఉన్న ప్రభుత్వ స్టడీ సెంటర్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఏడాది ఆగస్ట్ 31 నాటికి 14 ఏళ్లు వయస్సు నిండిన అభ్యర్థులు పదో తరగతిలో ప్రవేశానికి అర్హులు. 15 ఏళ్లు పూర్తయి పదో తరగతి పాసైనవారు, ఇంటర్ మధ్యలో ఆపేసినవారు/ఫెయిలైనవారు ఇంటర్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మరిన్ని వివరాలకు పట్టణంలోని ఆర్‌వీఎస్‌సీవీఎస్ హైస్కూల్‌లో ఉన్న ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్‌ను సంప్రదించవచ్చు.
సెల్ నెంబర్:9492248937
COMMENTS