చిలకలూరిపేట: వ్యవసాయ మార్కెట్‌కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఈ నెల 24వ తేదీన నిర్వహించటానికి సన్నాహాలు చేస్తు...
చిలకలూరిపేట: వ్యవసాయ మార్కెట్‌కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఈ నెల 24వ తేదీన నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నారు. నూతన కమిటీ కి సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఈ నెల 12వ తేదీ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌గా షేక్ కరిముల్లా, ఉపాధ్యక్షుడుగా పిల్లి కోటితో పాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, గౌరవ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. డైరెక్టర్లుగా జాష్టి రవి, పోపూరి హనుమంతరావు, అముడాల లీలా కిషోర్, చెన్నంశెట్టి పద్మ, నెల్లూరి శాంతి ప్రియ, గూడె అంజలి,పల్లపు సుమలత, అనంత వీర కుమారి, కురపాటి మల్లేశ్వరి, మంద దుర్గా భవాని,మొగిలి వెంకట నారాయణ, కాట్రు శ్రీనివాసరావు, షేక్ అబ్దుల్ నబిలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరు కాకుండా కమిటీలో ఎక్సె అఫిషియో సభ్యులుగా యడ్లపాడు మండలం సొలస ప్రాధమిక పరపతి సంఘంమ అధ్యక్షుడు,నరసరావుపేటకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, మున్సిపల్ చైర్మన్, జిల్లా వ్యవసాయ వాణిజ్య అండ్ మార్కెటింగ్ అధికారి వ్యవహరించనున్నారు.
COMMENTS