ఏ సమస్య వచ్చినా 24 గంటలు పనిచేసే వ్యవస్థ సిద్ధం ఏ సమస్య వచ్చిన ప్రజలు 08647253994 కు ఫోన్ చేయాలి మున్సిపల్ కమిషనర్ పి .శ్రీహరిబాబు చిలకలూరిప...
ఏ సమస్య వచ్చినా 24 గంటలు పనిచేసే వ్యవస్థ సిద్ధం
ఏ సమస్య వచ్చిన ప్రజలు 08647253994 కు ఫోన్ చేయాలి
మున్సిపల్ కమిషనర్ పి .శ్రీహరిబాబు
చిలకలూరిపేట: ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని మున్సిపల్ కమిషనర్ పి .శ్రీహరిబాబు హెచ్చరించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పట్టణ పరిధిలో భారీ వర్షాల కారణంగా తలత్తే అన్ని రకాల పరిస్థితులను తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజలు పాత ఇళ్లల్లో ఉండరాదని సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల నేపద్యంలో మున్సిపల్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. వర్షాలకు ముందుగానే పట్టణంలోని పెద్ద కాలువల్లో పూడికలు తీయించామని.. తద్వారా మురుగునీరు సక్రమంగా పారేలా ఏర్పాటు చేశామని వెల్లడించారు. వర్షాల కారణంగా తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉందని ప్రజలు తాగే నీతిని కాచి వడపోసి తాగాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో 24 గంటలు మూడు షిఫ్టుల్లో పనిచేయడానికి కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలకు ఎటువంటి సమస్య వాటిల్లో సంబంధిత నెంబర్ కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు. భారీ వర్షాలు, కూలిన మొదటి ప్రాంతాలు జలమయమైన మరే ఇతర సమస్యలకు ఈ కింద సూచించిన నెంబర్ కు ఫోన్ చేయాలని తెలిపారు. తమ సమస్యలను *08647253994* నెంబర్కు ఫోన్ చేసి సహాయం పొందాలని సూచించారు.
COMMENTS