* రోగులపై అనవసర భారం పడకుండా మెరుగైన సేవలు రోగితో ఆప్యాయంగా మాట్లాడి, చికిత్స ద్వారా సాంత్వన చేకూరుస్తూ ప్రజల మన్ననలు పొందుతు...
*
రోగులపై అనవసర భారం పడకుండా మెరుగైన సేవలు
రోగితో ఆప్యాయంగా మాట్లాడి, చికిత్స ద్వారా సాంత్వన చేకూరుస్తూ
ప్రజల మన్ననలు పొందుతున్న లీలావతి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సుష్మలావు
చిలకలూరిపేట:
వైద్యోనారాయణో హరి అనే నానుడి ప్రకారం వైద్యుడు భగవంతుడైన నారాయణుడి స్వరూపం. ప్రజలు కూడా దేవుడు జన్మనిస్తే డాక్టరు పునర్జన్మనిస్తాడు అనే విషయాన్ని త్రికర్ణశుద్దిగా నమ్ముతారు. ఇటువంటి పవిత్రమైన వైద్య వృత్తిలో ప్రసూతి వైద్యుల పాత్ర అత్యంత కీలకం. ప్రతి స్త్రీకి మాతృత్వం తియ్యని కల. బిడ్డకు జన్మనివ్వడం తల్లికి పునర్జన్మ వంటిదే. ప్రసవ సమయంలో ఒక్కోసారి తల్లి ప్రాణం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఓ కొత్త ప్రాణిని ప్రపంచంలోకి తీసుకురావడం, తల్లి ఆరోగ్యాన్ని కాపాడటం ప్రసూతి వైద్యులకు బాధ్యత. ఇటువంటి గురుతర బాధ్యత చేపట్టి చిలకలూరిపేట పట్టణంలో అనతి కాలంలోనే ప్రజల మన్ననలను పొందుతున్నారు లీలావతి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సుష్మలావు.పేదలపై అనవసర వైద్య ఖర్చుల భారం తగ్గించి, మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆమె పనిచేస్తున్నారు.
ఫ్రెండ్లీ డాక్టర్‌కు నిలువెత్తు నిదర్శనం
రోగులతో ప్రవర్తించే విధానం, నైతిక విలువలతో విధుల పట్ల అత్యంత అంకితభావాన్ని ప్రదర్శించి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ సుష్మలావు చిలకలూరిపేట పరిసర ప్రాంత ప్రజలకే కాదు. ప్రకాశం, బాపట్ల జిల్లా ప్రజలకు చేరువయ్యారు. రోగులకు వైద్యంతోపాటు వారిలో మానసిక దృఢత్వాన్ని కూడా పెంపొందించే విధంగా వారితో మాట్లాడాలని సీనియర్ వైద్యులు సూచిస్తుంటారు. రోగులు వారి వైద్యుడితో మాట్లాడేటప్పుడు, వారు తమ సమస్యలను శ్రద్ధగా వింటారని, వారి ఆందోళనలను అర్థం చేసుకుంటారని ఆశిస్తారు. అత్యధిక ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇటువంటి ఆశించటం కష్టం. కాని ఇందుకు భిన్నంగా డాక్టర్ సుష్మ వ్యవహార శైలీ ఉంటుంది.రోగులతో స్నేహపూర్వక సంబంధం కొనసాగించి రోగులు చెప్పేది శ్రద్ధగా వినడం, అందుకు అనుగుణంగా వైద్య సేవలు అందించటంతో ప్రెండ్లీ డాక్టర్‌గా ప్రజల నుంచి మన్ననలు పొందుతున్నారు.
పేట ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు
నేటి ఆధునిక జీవనశైలి, ఒత్తిడితో కూడిన పరిస్థితులు, అసమతుల్య ఆహారం ఇవన్నీ మహిళల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ప్రాథమిక దశల్లో కనిపించే కొన్ని లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల, చిన్న సమస్యలే పెద్ద వ్యాధులుగా మారే ప్రమాదం ఎక్కువ. అలాంటి అన్ని రకాల వ్యాధులకు అత్యాధునిక వైద్యసేవలు లీలావతి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల స్త్రీ వ్యాధులకు, గర్బిణీ, ప్రసూతి, సంతాన సాఫల్యత కు సంబంధించిన వైద్యసేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా అన్ని రకాల లాపరోస్కోపిక్ సర్జరీలు నిర్వహిస్తున్నారు. డయాగ్నస్టిక్ లాపరోస్కోపీ, లాపరోస్కోపిక్ ట్యూబల్ లిగేషన్, ట్యూబల్ రీకెనలైజేషన్. లాపరోస్కోపిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మేనేజ్మెంట్, లాపరోస్కోపిక్ ఓవేరియన్ సిస్టెక్టమీ, లాపరోస్కోపిక్ మైయోమెక్టోమీ, లాపరోస్కోపిక్ హిస్టెరెక్టమీ, లాపరోస్కోపిక్ ఎండోమెట్రియోసిస్ సర్జరీ లాంటి లాపరోస్కోపిక్ సర్జరీలు డాక్టర్ సుష్మ లావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
సంతానం లేని దంపతులకు
వివాహమైన దంపతులకు సంతాన భాగ్యం ఓ ఆకాంక్ష.. ఓ ఆశ.. ఓ అవసరం. తమ వారసుల కోసం తహతహలాడని వారుండరు. ప్రతి స్త్రీ కూడా మాతృత్వాన్ని ఆస్వాదించాలని, అనుభవించాలని ఉవ్విళ్లూరుతుంది. ప్రతి స్త్రీ అమ్మా అని... ప్రతి పురుషుడు నాన్నా అని పిలిపించుకునేందుకు ఈ సృష్టిలో ఎన్నో సహజ మార్గాలున్నాయి. ఆ అదృష్ట భాగ్యం మాకు లేదే అని మధనపడిపోతున్న వారి కోసం వైద్య శాస్త్రం ప్రత్యామ్నాయంగా కొన్ని విధానాలను కూడా సృష్టించింది. ఇందులో భాగంగానే సంతానం లేని దంపతులకు లీలావతి ఆసుపత్రి అతి తక్కువ ఖర్చుతోనే మార్గం సుగమనం చేస్తోంది. సంతాన లేమికి కారణాలు అన్వేషించటం, అందుకు అవసరమైన సూచనలు అందజేయటంతో పాటు అవసరమైన వైద్య సేవలు అందజేస్తున్నారు.
మాతా, శిశువు సంరక్షణలో..
గర్భం దాల్చినది మొదలు ప్రతి నెలా ప్రత్యేకమే! గర్భంలో పిండం సక్రమంగా ఎదగాలంటే బిడ్డ పోషణకు సరిపడా బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం మాంసకృత్తులు ఎక్కువగా ఉండే గుడ్లు, చేపలు తినాలి. శాకాహారులైతే బ్రకోలీ, పుట్టగొడుగులు, తృణధాన్యాలు, పప్పులు, నట్స్, ఆకుకూరలు తీసుకోవాలి ఇలాంటి విషయాలు చెబుతూ ఈ క్రమంలో లీలావతి ఆసుపత్రి తల్లిలా ఆదరిస్తుంది. గర్బిణీలకు అవసరమైన అన్ని రకాల వైద్య సలహాలు అందజేస్తూ సాధారణ కాన్పు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసరం అయితే తప్ప సిజేరియన్‌కు సిఫార్స్ చేయటం లేదు. ప్రస్తుత తరుణంలో గర్బిణీలకు ఇది ఉపసమనం కలిగించే వార్తే. శిశువు జన్మించినప్పటి నుంచి కూడా అవసరమైన బాలింతకు అవసరమైన అన్ని రకాల వైద్యసేవలు అందజేస్తూన్నారు.
వైద్య వృత్తి పట్ల 10 సంవత్సరాలుగాపూర్తి నిబద్ధత, నిజాయతీ, ఉదారత చూపుతూ వైద్య వృత్తికి వన్నె తెస్తున్న లీలావతి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుష్మ లావుకు ప్రజల నుంచి అనుహ్యంగా నానాటికి మద్దతు లభిస్తుంది . రోగితో ఆప్యాయంగా మాట్లాడి, చికిత్స ద్వారా సాంత్వన చేకూరుస్తూ...ఎంతమందికి నయం చేశాం, ఎందరికి ప్రాణదానం చేశాం....ఎన్ని కుటుంబాల్లో ఆనందం నింపామన్న భావన తో రోగి సంక్షేమమే అత్యున్నతమనే నమ్ముతున్న 10 సంవత్సరాలుగా వైద్యురాలు సుష్మ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు


COMMENTS