రాష్ట్రవ్యాప్తంగా 30 మార్కెట్ యార్డు కమిటీలకు కూటమి ప్రభుత్వం బుధవారం ఛైర్మన్లను నియమించింది. ఈ పదవుల్లో తెదేపాకు 25, జనసేనకు 4, భాజపాకు 1...
రాష్ట్రవ్యాప్తంగా 30 మార్కెట్ యార్డు కమిటీలకు కూటమి ప్రభుత్వం బుధవారం ఛైర్మన్లను నియమించింది. ఈ పదవుల్లో తెదేపాకు 25, జనసేనకు 4, భాజపాకు 1 దక్కాయి. 15 మంది ఓసీలు, 8 మంది బీసీలు, నలుగురు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఇద్దరు మైనార్టీలకు అవకాశం కల్పించింది. వీరిలో నలుగురు మహిళలకు ప్రాతినిధ్యం లభించింది. ఇప్పటికే రెండు విడతల్లో 85 మార్కెట్ యార్డు కమిటీలకు ఛైర్మన్లను నియమించగా.. తాజాగా మరో 30 మందికి అవకాశం కల్పించారు. మూడు విడతల్లో కలిపి 115 కమిటీలకు నామినేటెడ్ పదవులు భర్తీ అయ్యాయి. మొత్తం 218 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా.. వీటికి సంబంధించి ఇంకా 103 పాలకమండళ్లను నియమించాల్సి ఉంది.
COMMENTS