వరుణ్ ధావన్, సమంత (Samantha) జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్ ‘సిటడెల్: హనీ-బన్నీ’ (Honey Bunny). ప్రియాంక చోప్రా, రిచర...
వరుణ్ ధావన్, సమంత (Samantha) జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్ ‘సిటడెల్: హనీ-బన్నీ’ (Honey Bunny). ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ నటించిన వెబ్ సిరీస్‌కి ఇండియన్ వెర్షన్‌గా ఇది రూపొందిన విషయం తెలిసిందే. దీని పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సిరీస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. దీని సీజన్2ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
ప్రియాంక నటించిన సిటడెల్ ఆధారంగానే ఇండియన్ వెర్షన్, ఇటాలియన్ వెర్షన్లు (Citadel: Diana) రూపొందాయి. తాజాగా ఈ రెండింటి కొనసాగింపులను రద్దు చేశారు. బదులుగా వీటిని మాతృకలో విలీనం చేయనున్నారు. ఈవిషయంపై అమెజాన్ ప్రతినిధులు స్పష్టత నిచ్చారు. ‘‘సిటడెల్: హనీ-బన్నీ, సిటడెల్: డయానా తదుపరి సీజన్లను నిలిపివేసి.. వాటి కొనసాగింపు కథలను మాతృకలో విలీనం చేస్తున్నాం. ఈ సిరీస్ అన్ని భాషల్లోనూ అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. ఇది ఓ భావోద్వేగ ప్రయాణం. మాతృకను మరింత గొప్పగా తెరకెక్కించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని తెలిపారు. ఇక ప్రియాంక నటిస్తోన్న ‘సిటడెల్ పార్ట్2’ 2026లో విడుదల కానున్నట్లు చెప్పారు.
యాక్షన్ థ్రిల్లింగ్ నేపథ్యంలో ఈ వెబ్‌సిరీస్‌లు రూపొందాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా (amazon prime video) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇండియన్ వెర్షన్ కూడా గొప్ప ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. వ్యూస్ పరంగా ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో వరుణ్ ధావన్ దీని సీజన్2 గురించి మాట్లాడుతూ.. మేకర్స్ ఈ సిరీస్ పార్ట్ 2ను సినిమాగా తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అయితే తాజాగా అమెజాన్ దీన్ని రద్దు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
COMMENTS