నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన 2024 నీట్ పరీక్షలో జరిగిన అవకతవకల పై పరీక్ష పేపర్లు లీకైన విధానం పై అదేవిధంగా ఎన్నడూ నీటి పరీక్షల్లో కన...
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన 2024 నీట్ పరీక్షలో జరిగిన అవకతవకల పై పరీక్ష పేపర్లు లీకైన విధానం పై అదేవిధంగా ఎన్నడూ నీటి పరీక్షల్లో కని విని ఎరుగని రీతిలో దేశవ్యాప్తంగా 76 మంది నీట్ పరీక్షల్లో మొదటి స్థానం రావడంతో అనుమానాలు వ్యక్తం చేస్తూ తక్షణమే సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి నీట్ పరీక్షను మరల నిర్వహించాలని గుంటూరు NSUI పక్షాన డిమాండ్ చేస్తూ 24 లక్షల విద్యార్థుల భవిష్యత్తును ప్రాణాలను కాపాడాలంటూ నేడు గుంటూరు జిల్లా NSUI అధ్యక్షుడు షేక్.కరీం ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో హిమని సెంటర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో NSUI జిల్లా ఉపాధ్యక్షుడు తిరుమలరావు, NSUI నాయకులు మదన్,సుమంత్,రాజు, మీరవాలి,బాబు, తదితరులు పాల్గొన్నారు.
COMMENTS