- ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ జీ.పీ.రాజశేఖర్ - విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రారంభమైన ఐసీఈటీఎమ్‌ఎస్‌సీ–24 అంతర్జాతీయ కాన్ఫరెన్స్ విద్యార్థులందరూ డ...
- ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ జీ.పీ.రాజశేఖర్
- విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రారంభమైన ఐసీఈటీఎమ్‌ఎస్‌సీ–24 అంతర్జాతీయ కాన్ఫరెన్స్
విద్యార్థులందరూ డైటాసైన్స్‌పై విస్తృత పరిశోధనలు చేయాలని ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ జీ.పీ.రాజశేఖర్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేథమ్యాటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగం ఆధ్వర్యంలో '' ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ మేథమ్యాటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్'' అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను హైబ్రిడ్ మోడ్‌లో (ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్) గురువారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ జీ.పీ.రాజశేఖర్ మాట్లాడుతూ మేథమ్యాటిక్స్, స్టాటిస్టిక్స్‌లో ప్రావీణ్యం పొందిన విద్యార్థులు భవిష్యత్‌లో డేటాసైన్స్‌ను పరిశోధనాంశంగా ఎంచుకోవాలన్నారు. ప్రస్తుతం అన్ని మల్టీ నేషనల్ కంపెనీలు డేటాసైన్స్‌ను విరివిగా వినయోగిస్తున్నారని తెలియజేసారు. కాబట్టి ఇందులో ప్రావీణ్యం పొందిన విద్యార్థులకు మంచి డిమాండ్ ఉంటుందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మాట్లాడుతూ సమాచారం ఎప్పటికప్పడు మారుతూ ఉంటుంది. విద్యార్థులు అప్‌డేట్ అయితేనే పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలరని, నేర్చుకోవడం నిరంతర ప్రక్రియగా మార్చుకోవాలన్నారు. కేవలం అకడమిక్ పరిజ్ఞానానికే పరిమితం కాకుండా వీలైనన్ని కొత్త విషయాలూ తెలుసుకోవాలన్నారు. కార్యక్రమానికి ఆన్‌లైన్‌లో ముఖ్య అతిథిగా హాజరైన సౌది అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నబిల్ మలైకీ విద్యార్థులకు ఆల్‌జీబ్రాలో వస్తున్న సరికొత్త డెవలప్‌మెంట్స్‌ను నిత్యజీవితంలో ఎలా వినియోగించాలో తెలియజేసారు. అలాగే ఆన్‌లైన్‌లో మరో ముఖ్య అతిథిగా హాజరైన లెబనాన్‌లోని లెబనీస్ అమెరికన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జుల్కర్‌మైన్ సబిర్ విద్యార్థులకు న్యూమరల్ నెట్‌వర్క్ సిస్టమ్‌లోని మెళుకువలను వివరించారు. కార్యక్రమంలో వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
COMMENTS