కార్యకర్తల క్షేమమే మా ధ్యేయం డేగల ప్రభాకర్ కార్యకర్తల సంక్షేమం పట్ల టీడీపీకి వున్న చిత్తశుద్ధి , అంకితభావం మరే ఇతర పార్టీకీ లేదని తెలుగుదేశం...
కార్యకర్తల క్షేమమే మా ధ్యేయం
డేగల ప్రభాకర్
కార్యకర్తల సంక్షేమం పట్ల టీడీపీకి వున్న చిత్తశుద్ధి , అంకితభావం మరే ఇతర పార్టీకీ లేదని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బండ్లమూడి మధు గుండె సమస్యతో బాధపడుతూ బైపాస్ సర్జరీ చేయించుకోగా తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని,ఆర్థిక సహాయాన్ని చేసి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమం కోసం కార్యకర్తల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందన్నారు. కార్యకర్తల క్షేమం కోసం దేశంలో ఏ పార్టీలో లేని విధంగా ఒక టిడిపిలో మాత్రమే కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన మధు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ , పార్టీ కార్యదర్శి నిశంకరరావు అమర్నాథ్ పాల్గొన్నారు.
COMMENTS