*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెను వెంటనే ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి డీఎస్సీ ప్రకటించడ...
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెను వెంటనే ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి డీఎస్సీ ప్రకటించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర నాయకులు బి.తిరుపాల్ మరియు జనరల్ సెక్రెటరీ తులసీదాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ వినాశనానికి కారణమైన జీ.వో నెంబర్ 117 ను రద్దు చేయాలని, పాఠశాల తనిఖీల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది మండల విద్యాశాఖాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు కోత విధించిన వార్షిక ఇంక్రిమెంట్లను పునరుద్ధరించాలని, కోర్టు ఉత్తర్వులను అనుసరించి యాజమాన్యాల వారీగా పదోన్నతులు కల్పించాలని అన్నారు. అదేవిధంగా శ్రీ నారా లోకేష్ కు విద్యాశాఖ కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వారి హయాంలో ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి చెందుతాయని, ఉపాధ్యాయుల సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాలల అభివృద్ధి కొరకు ప్రభుత్వానికి తమ సంఘ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు మాల్యాద్రి రెడ్డి, చలపతిరావు, ఎం.డి. ఖాసిం, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.*
COMMENTS