రాష్ట్ర రాజధాని అమరావతికి ఏర్పడిన అవరోధాలు తొలగిపోయిన నేపధ్యంలో నవ నిర్మాణాలతో రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారుతుందని తెలుగుదేశం పార్టీ గుంటూ...
రాష్ట్ర రాజధాని అమరావతికి ఏర్పడిన అవరోధాలు తొలగిపోయిన నేపధ్యంలో నవ నిర్మాణాలతో రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారుతుందని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు.గురువారం అర్బన్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డేగల ప్రభాకర్ మాట్లాడారు.ఆంధ్ర రాష్ట్ర సంపదను మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కొల్లగొట్టారని ఆరోపణలు చేశారు. జగన్ మీద ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో వచ్చిందన్నారు. దేశం నుంచి బ్రిటిష్ వారిని ఎలా తరిమారో..రాష్ట్రం నుంచి జగన్‌ను ప్రజలు తరిమికొట్టారని గుర్తుచేశారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ఖాజానా మొత్తం ఖాళీ అయ్యిందని పేర్కొన్నారు.అమరావతిని నాశనం చేయాలని చూసిన వైసీసీ అధినేత జగన్ రెడ్డి కి రాష్ట్ర ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారని,కూటమి పాలన వచ్చిందని,అమరావతి వేగంగా అభివృద్ధి చెంది విశ్వనగరంగా విరాజిల్లుతుందని అన్నారు.నాటి వైసీసీ దుష్టపాలన ఒక పీడకల అని అన్నారు.తుగ్లక్ నాయకుడు జగన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో రాష్ట్రం నాశనమైందని మండిపడ్డారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లూ అన్ని వర్గాలపై ఉక్కుపాదం మోపిందని ఆరోపించారు.రాజధాని నిర్మాణం నిలిచిపోవడంతో స్థానికంగా ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లేక పనుల కోసం కార్మికులు ఇతర రాష్టాలకు వలసపోవాల్సిన దుస్థితి నెలకొందని గుర్తు చేశారు.కూటమి విజయంతో అమరావతి నిర్మాణం పునఃప్రారంభమై స్థానికంగా కార్మికులు, యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు వస్తాయని స్పష్టం చేశారు.ఐదేళ్లపాటు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు,దౌర్జన్యాలు,మారణకాండకు తగిన మూల్యం చెల్లించుకున్నారని అన్నారు.ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు చిత్తుచిత్తుగా ఎందుకు ఓడించారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవుపలికారు.
COMMENTS