ఏపీ సచివాలయానికి చేరుకున్నారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన సచివాలయానికి చేరుకున్న వెంటనే సెక్రటరీలు, పోలీసు ఉన్నతాధికారులు ...
ఏపీ సచివాలయానికి చేరుకున్నారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన సచివాలయానికి చేరుకున్న వెంటనే సెక్రటరీలు, పోలీసు ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. సచివాలయంలో అడుగు పెట్టిన వెంటనే పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఆ తరువాత సచివాలంలోని తన ఛాంబర్ ను పరిశీలించారు. ఇదిలా ఉంటే గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి అమరావతి మీదుగా సచివాలయానికి చేరుకునే మార్గం మొత్తం అభిమానులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఏపీ సచివాలయానికి చేరుకున్నారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన సచివాలయానికి చేరుకున్న వెంటనే సెక్రటరీలు, పోలీసు ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. సచివాలయంలో అడుగు పెట్టిన వెంటనే పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఆ తరువాత సచివాలంలోని తన ఛాంబర్ ను పరిశీలించారు. ఇదిలా ఉంటే గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి అమరావతి మీదుగా సచివాలయానికి చేరుకునే మార్గం మొత్తం అభిమానులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వెంకటాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్‌లో డిప్యూటీ సీఎం పవన్‌కు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు అభిమానులు. ఆయన వచ్చే మార్గం మొత్తం పూలబాట పరిచారు. దారిపొడవునా రైతులు, కూటమి నేతలు, జనసైనికులు, వీరమహిళలు పూలు జల్లుతూ స్వాగతం పలికారు. కొందరు పవన్ వీరాభిమానులు పవన్ కోసం ప్రత్యేకంగా భారీ గజమాల సిద్ధం చేశారు.
ఎన్నికల ఫలితాలు విడుదలై డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ తొలిసారి జూన్ 18న ఏపీ రాష్ట్ర సచివాలయానికి వెళ్లారు. అక్కడ తనకు కేటాయించిన చాంబర్ పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా సచివాలయంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు ఛాంబర్ కు వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. 2017 తర్వాత పవన్ సచివాలయానికి రెండవసారి వెళ్లనున్నారు. నాడు ఉద్దానం సమస్యలపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయి చర్చించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి వెళ్లిన పవన్.. రాష్ట్ర సచివాలయంలోని బ్లాక్-2లో తనకు కేటాయించిన ఛాంబర్‌ని పవన్ పరిశీలించారు. రేపు పంచాయతీరాజ్, గ్రామీణ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా పవన్ బాధ్యతలు స్వీకరించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంతకంటే ముందు పవన్ కల్యాణ్‌కు Y ప్లేస్ కేటగిరి, ఎస్కార్ట్ సెక్యూరిటీ పెంచింది ప్రభుత్వం. అలాగే బులెట్ ప్రూఫ్ కారును కూడా కేటాయించింది. సీఎం జగన్ కాన్వాయ్‌లో ఒకటైన బులెట్ ప్రూఫ్ వాహనాన్ని పవన్‌కు కేటాయించారు. గతంలో ప్రభుత్వం కేటాయించిన వాహనం కాకుండా డిజైన్ చేయించిన బులెట్ ప్రూఫ్ వాహనాన్ని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉపయోగించారు. స్టాండ్ బైలో ఉండే 2345 నంబర్ గల అదే బులెట్ ప్రూఫ్ వెహికల్‌ను పవన్ కళ్యాణ్‌కు కేటాయించినట్లు తెలుస్తోంది.
COMMENTS