కావలసినవి: కర్బూజ ముక్కలు – 1 కప్పు మామిడిపండు ముక్కలు – 1 కప్పు చెర్రీ టొమాటో ముక్కలు – అర కప్పు దోస ముక్కలు – అర కప్పు (పైన తొక్క,ల...
కావలసినవి:
- కర్బూజ ముక్కలు – 1 కప్పు
- మామిడిపండు ముక్కలు – 1 కప్పు
- చెర్రీ టొమాటో ముక్కలు – అర కప్పు
- దోస ముక్కలు – అర కప్పు (పైన తొక్క,లోపలి గింజలు తీసివేయాలి)
- లేత స్వీట్ కార్న్ – అరకప్పు
- ఎర్ర ఉల్లిపాయలు – పావు కప్పు (సన్నగాతరగాలి)
- నిమ్మరసం – 3 టీ స్పూన్లు
- ఆలివ్ ఆయిల్– 1 టీ స్పూన్
- అల్లం తురుము – 2 టీ స్పూన్లు
- క్యాప్సికమ్ – 1 (సన్నగా తరగాలి)
- ఉప్పు – అర టీ స్పూన్
- కొత్తిమీర, పుదీనా, తులసి ఆకులు – 2 టేబుల్ స్పూన్లు
తయారి:
- పాత్రలో మామిడిపండు, కర్బూజ,చెర్రీ టొమాటోలు,దోస, స్వీట్ కార్న్, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్ వేసి సూన్ తో కలపాలి.
- ఒక చిన్న గిన్నెలో నిమ్మరసం, ఉప్పువేసి ఈ మిశ్రమాన్ని పండ్లముక్కలకు పట్టేలా కలపాలి.
- సర్వ్ చేసే ముందు సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, తులసి ఆకులతో గార్నిష్ చేయాలి.
నోట్: ఉల్లిపాయలు పచ్చిగా తింటే అర గదు అనుకునేవారు వేడినీటిలో కాసేపు ఉంచి తీసి వాడుకోవాలి. ఉల్లిపాయల బదులుగా తరగిన ఉల్లి కాడల (స్పింగ్ ఆనియన్)ను కూడా వాడుకోవచ్చు.
క్యాలరీలు: 263.15 కి.క్యా
కార్బోహైడ్రేట్లు: 45.79 గ్రా.
ప్రొటీన్లు: 5.29 గ్రా.
ఐరన్l: 5.27 మి. గ్రా.
క్యాల్షియం: 119.5 మి. గ్రా.

COMMENTS