డిప్రెషన్కు కారణాలు : జీవితంలో సంభవించే ఒడిదొడుకులు , జబ్బుల వల్ల కలిగే బాధ , కొన్ని రకాల మందుల వల్ల కలిగే బాధ , నిద్రలేమి , అతి...
డిప్రెషన్‌కు కారణాలు :
జీవితంలో సంభవించే ఒడిదొడుకులు, జబ్బుల వల్ల కలిగే బాధ, కొన్ని రకాల మందుల వల్ల కలిగే బాధ, నిద్రలేమి, అతి నిద్ర, అలసట, శక్తి లేకపోవటం, ఆకలి లేకపోవటం, వ్యాయామం లేకపోవటం, జీవితంలో జరిగే పరిణామ క్రమంలో డిప్రెషన్ ఎప్పుడైనా రావచ్చు. పిల్లలు పుట్టడం, మెనోపాజ్, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగంలో సమస్యలు, హెచ్ఐవి, కేన్సర్, మెదడులో కణుతులు, కుటుంబసభ్యుల అకాల మరణం, ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, భూకంపం, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు, భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు విడిపోవటం. పిల్లలు కలగక పోవటం, ఉద్యోగంలో స్థాన భ్రంశం, ఎన్నికల్లో ఓడిపోవటం, చదువులో, ఇంటర్వ్యూలో, వీసా ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అవటం, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా భార్యా పిల్లలకు, తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి రావటం, ఇతర వ్యాధుల వల్ల కలిగే కారణాలు, పురుషుల్లో హైపో ఆండ్రోజనిజమ్, మల్టిపుల్ స్ల్కీరోసిస్, దీర్ఘకాలిక నొప్పులు, పక్షవాతం, మధుమేహం, కేన్సర్ల వల్ల డిప్రెషన్కు గురయ్యే అవకాశముంది.
డిప్రెషన్కు దూరంగా ఉండటమెలా ?
డిప్రెషన్కు దూరంగా ఉండటమెలా ?
- స్నేహితులు, హితులబంధువుల సహాయం తీసుకోండి.
- క్రమం తప్పకుండావ్యాయామం చేయడం, సమయానికి నిద్రపోవడం, భోజనవేళలు పాటించడం.
- ప్రాకృతిక ఆహారం, పండ్లు, కూరగాయలు, మసాలాలు లేకుండాభోజనం చేయాలి.
- ధ్యానం, శ్వాసకోశ వ్యాయామాలు చేయండి.
- స్నేహితులతో విందులు, వినోదకార్యక్రమాల్లో పాల్గొనండి.
- పనికిరాని ఆలోచనలు మానండి. ఏదో ఒకపని చేస్తుండండి.
- తోటివారికి సహాయకార్యక్రమాల్లో పాల్గొనండి.
- చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్పండి. ట్రాఫిక్లో హెల్ప్ చేయండి. బస్స్టాప్లోఇతరులకు సహాయపడండి.
- భగవంతుని కార్యక్రమాల్లో చేతనైన సాయం చేయడం, భగవంతుని సేవలో పాల్గొనడం ద్వారా డిప్రెషన్ను దూరం చేయవచ్చు.

COMMENTS