జలుబుకి సంబందించి బాగా ప్రచారంలో ఉన్న అనేక మూఢనమ్మకాల్లో తడి జుట్టుతో బయట తిరిగితే జలుబు చేస్తుందనేది కూడా ఉంది. అంతేకాదు, తలంటు స్నానం చేసి...
జలుబుకి సంబందించి బాగా ప్రచారంలో ఉన్న అనేక మూఢనమ్మకాల్లో తడి జుట్టుతో బయట తిరిగితే జలుబు చేస్తుందనేది కూడా ఉంది. అంతేకాదు, తలంటు స్నానం చేసిన వెంటనే జుట్టు తుడిచి ఆరపెట్టుకోక పోయినా జలుబు చేస్తుందనే నమ్మకమూ జనంలో ఉంది. వానలో తడిసినా, చలిలో తిరిగినా, ఎక్కువసేపు ఈత కొట్టినా కూడా వెంటనే జలుబు చేస్తుందనే అభిప్రాయం ఉంది.
జలుబు అనేది వైరస్ సూక్ష్మజీవుల వల్ల వస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు వందకు పైగా ఎన్నో రకాల వైరస్లు అందుకు కారణమవుతాయి. ఆ వైరస్లు మన శరీరంలోకి ప్రవేశించి, మన రోగనిరోధక వ్యవస్థపై ఆధిపత్యం సాధిస్తాయి. అందువల్ల మనకు జలుబు వస్తుంది. అంతే కాని మనం ఎక్కువసేపు నీళ్ళలో నానినందుకో లేదా తడిజుట్టుతో బయట తిరిగినందుకోరాదు. జలుబు చేయడానికి కారణమయ్యే వైరస్లు మన చుట్టూ దాదాపు అన్ని ప్రదేశాల్లోనూ, అన్ని రుతువుల్లోనూ ఉంటాయి. మన శరీర ఆరోగ్యవ్యవస్థ అంతో ఇంతో బలహీన పడినపుడు మాత్రమే ఇవి మనపై తమ ప్రభావాన్ని చూపగలవు. అదేవిధంగా జలుబుతో బాధ పడుతున్న వారి దగ్గర ఎక్కువసేపు ఉంటే జలుబు వైరస్లు మన శరీరం లోకి ప్రవేశించి మన మీద తమ ప్రభావాన్ని చూపుతాయి అందుకే ఒకరికొచ్చిన జలుబుని మరొకరికి అంటించకుండా జాగ్రత్తపడాలి. అంటే తుమ్ము వచ్చినపుడు రుమాలు అడ్డుపెట్టుకోవాలి. చేతులు కడుక్కోవడం వంటి ఆరోగ్య సూత్రాలు తప్పకుండా పాటించాలంటున్నారు వైద్యులు.

COMMENTS