Stop Smoking చాలకాలంగా పొగతాగే అలవాటు ఉన్నవారిలో దాన్ని వదలమంటే చాల ఇబ్బంది గా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఆపేస్తే మాత్రం ఏం ప్రయోజనం ? ...
![]() |
| Stop Smoking |
చాలకాలంగా పొగతాగే అలవాటు ఉన్నవారిలో దాన్ని వదలమంటే చాల ఇబ్బంది గా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఆపేస్తే మాత్రం ఏం ప్రయోజనం? అని సాకులు చెబుతుంటారు. నిజానికి పొగ మానేసిన సమయం నుంచే క్యాన్సర్ ముప్పు తగ్గమూ మొదలవుతుంది. పక్షాతం, గుండె, ఊపిరితిత్తి జబ్బుల ముప్పులూ తగ్గుముఖం పడతాయి. పొగ మానటం వల్ల ఇవే కాదు. మరిన్ని లాభాలు కూడా ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు.
- శరీరం మరింత శక్తిని పుంజుకుంటుంది. శ్వాస తీసుకోవం తేలికవుతుంది. వ్యాయామం, పనులు చేసేటప్పుడు ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
- రుచి, వాసన మునుపటి కన్నా బాగుంటాయి. అందువల్ల ఆకలి పెరిగి మంచి పోషకాహారం తీసుకోవటనికి బీజం వేస్తుంది.
- వేళ్ల మీద, పెదవులమీద ఏర్పడిన మచ్చలు తగ్గుతాయి.
- దుస్తులు, జట్టు, శ్వాస పొగ వాసన రావు. ఇది ఇతరులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవటనికి దోహదం చేస్తుంది.
- చర్మం కూడా కొత్త ఆరోగ్యంతో నిగనిగలడుతుంది.
- దంతాల ఆరోగ్యమూ మెరుగవుతుంది.
పొగ మానేయగానే లోలోన ఎంతో హాయిగా ఉన్నామన్న భావన కలుగుతుంది.

COMMENTS