Pain Killer Tablets పెయిన్ కిల్లర్స్ లేక బాధానివారిణులను ఎక్కువగా వాడితే అది మన బాధలకు , నొప్పులను తాత్కాలికంగా నివారించవచ్చు కానీ వాటి వల్ల...
![]() |
| Pain Killer Tablets |
పెయిన్ కిల్లర్స్ లేక బాధానివారిణులను ఎక్కువగా వాడితే అది మన బాధలకు, నొప్పులను తాత్కాలికంగా నివారించవచ్చు కానీ వాటి వల్ల ఆ తరువాత కొన్ని అనారోగ్యాలు వచ్చి పడే ప్రమాదం ఉంది. వాటికి బదులుగా కొన్ని సహజసిద్ధమైన, ప్రకృతి ప్రసాదించిన పదార్థాలను కొద్ది కాలం పాటు క్రమబద్ధంగా ఉపయోగిస్తే బాధలు, నొప్పుల నుంచి శాశ్వతమైన విముక్తి కలుగుతుంది. ప్రకృతి సహజమైన నొప్పి నివారణ మార్గలు ఉండగా, బాధా నివారణ కోసం మాత్రలు, మందులు తీసుకోవడం అంత మంచిది కాదు. ఏ శస్త్ర చికిత్స చేసినప్పుడో పెయిన్ కిల్లర్స్ వాడడం వేరు, చిన్న చిన్న నొప్పులను నివారించడానికి పెయిన్ కిల్లర్స్ వేసుకొవడం వేరు. ఇలా పెయిన్ కిల్లర్స్ వాడడం ఆరోగ్యానికి, ఆయుర్దాయానికి అంత మంచిది కాదు. ప్రకృతి సహజంగా కొన్ని బాధా నివారిణులు ఉన్నాయి, వాటిని నొప్పులకు ఉపయోగిస్తే నొప్పుల నుంచి ఉపశమనం కలగడమే కాకుండా, ఇతరత్రా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
- కండరాల నొప్పి ఉన్నవారు నేరేడు పండ్లు, రేగి పండ్లు, సీతాఫలం పండ్లు, స్ట్రాబెర్రీలలో ఏ పండ్లయినా కొద్దిగా తింటే ఉపశమనం కలుగుతుంది. బాధను లేదా నొప్పిని కలిగించే ఎంజైములను నిరోధించి నొప్పిని క్షణాల్లో తీసేసే శక్తి ఈ పండ్లకు ఉంది. ఎర్రటి చెర్రీలను తినడం వల్ల కూడా కండరాల నొప్పి కొద్ది సేపటిలో మటుమాయం అవుతుంది. ఈ పండ్లే కాక, పసుపు కూడా అనేక నొప్పులను నివారిస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులకు పసుపును మించిన మందు లేదని చైనా, కొరియా, జపాన్ వంటి ఆసియా దేశాలవారికి అనుభవపూర్వకమైన నమ్మకం. మన వంటల్లో ఉపయోగించే పసుపు నిజానికి ఓ అద్భుతమైన, దివ్యమైన ఔషధమని వారికి గట్టి నమ్మకం.
- బాధా నివారణకు పెరుగు అద్భుతంగా ఉపయోగపడుతుంది. కడుపు నొప్పి వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరకో, మందుల దుకాణానికో పరుగెత్తకుండా కొద్దిగా పెరుగు తినేస్తే కొద్ది సేపటిలోనే బాధ తగ్గిపోతుంది. అజీర్తిని, మలబద్ధకాన్ని, కడుపులో పేరుకుపోయే విష పదార్థాలను తొలగించగల శక్తి పెరుగుకు ఉంది. జీర్ణకోశ సంబంధమైన అనేక సమస్యలకు పెరుగులో ఉన్న లాక్టోబాసిలీ అనే పదార్థం నివారణనిస్తుంది. భోజనం చేసిన తరువాత తాజా పండ్లను, ముఖ్యంగా బాగా పండిన అరటి పండ్లను పెరుగన్నంలో కలుపుకుని తినడం చాల మంచింది. మనం భుజించే అనేక ఆహార పదార్థాల ద్వారా వాతావరణంలోని కొన్ని రసాయనాలు కూడా శరీరంలో చేరి, విష పదార్థాలుగా మారుతుంటాయి. వాటిని తొలగించగలిగిన శక్తి పెరుగు, మజ్జిగలకు ఉంది.
- పసుపులోని యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ మూలకాలు పేగుల్లోనూ, నరాలలోనూ వచ్చే నొప్పులను అతి వేగంగా నివారిస్తాయి. వంటల్లో పసుపును కాస్తంత వాడడం ఆరోగ్యానికి మంచిది. మిరియాలు కూడా ఇటువంటి నొప్పుల నుంచి విముక్తి కలిగిస్తాయి. అందువల్ల వంటల్లో ఈ రెండింటినీ, ముఖ్యంగా పసుపును ఉపయోగించడం మరచిపోకూడదు.
- కడుపులో నొప్పికి, కడుపులో వికారాలకే కాక, పంటి నొప్పులకు, చెవి నొప్పులకు అల్లం ఉపయోగపడినంతగా మరేదీ ఉపయోగపడదని వైద్యులు చెబుతున్నారు. అల్లంతో దగ్గు, జలుబు వంటి సమస్యలను కూడా నివారించవచ్చు. మాడుపోటు, పార్శ్వపు నొప్పి, కండరాల నొప్పులకు కూడా అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. వంటకాల్లో వీలైనప్పుడల్లా దీన్ని ఉపయోగించడంతో పాటు, అడపాదడపా కొద్దిగా అల్లం రసాన్ని తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది. టీలో అల్లం రసం కలుపుకుని తాగడం, అల్లం మురబ్బా తినడం అనేక శారీరక నొప్పుల నుంచి విముక్తిని ఇస్తుంది. వాంతులు, వికారాలకు కూడా అల్లం రసం ఎంతో మంచిదని, ప్రయాణాలు పడనప్పుడు కొద్దిగా అల్లం రసం తీసుకుని బయలుదేరితే ప్రయాణాల్లో వాంతులు రావడం తగ్గిపోతుందని కూడా వైద్యులు సూచిస్తున్నారు..
- హెర్బల్ టీ (మూలికలతో కూడిన టీ) కూడా ఓ బాధా నివారిణేనని డాక్టర్లు చెబుతున్నారు. మైగ్రేన్, తలనొప్పి, మెడ నొప్పి వంటివి శాశ్వతంగా నివారణ కావాలంటే తరచూ హెర్బల్ టీ తాగడం మంచిది. ఈ టీ నేరుగా రక్తనాళాల మీద పనిచేసి, రక్త సరఫరాను మెరుగుపరచి, తల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. టీ, గ్రీన్ టీ తాగడం అలవాటున్నవారు వారానికి ఒకటి రెండు సార్లు హెర్బల్ టీ కూడా తాగడం వల్ల ఇటువంటి నొప్పుల నుంచి శాశ్వతంగా బయటపడతారు. బాదం పప్పులు, ఉలవలు కూడా తల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఉపయోగపడతాయి. వీటిని తరచూ తినడం వల్ల ఈ సమస్యలు దగ్గరకు వచ్చే అవకాశం తగ్గిపోతుంది

COMMENTS